నకిరేకల్ ఆనంద నిలయంలో అక్రమాలు?
- ఆరు నెలలుగా విధులకు దూరమైనా వేతనాలు..!
- విద్యార్థులకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి అంటూ ఆరోపణలు
- ఎఫ్ఏసి, ఏఎస్డబ్ల్యూఓ తీరుపై విద్యార్థి సంఘాల పిర్యాదు.
- సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
కట్టంగూర్ (నకిరేకల్), నవంబర్ 11: నకిరేకల్ పట్టణంలోని(Nakrekal town) ఆనంద నిలయం ఎస్సీ బాలుర వసతిగృహంలో(SC Boys Hostel) తీవ్ర అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రభుత్వ నిధులు(Government funds) పక్కదారి పడుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు(Leaders of student organizations) ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించి జిల్లా కలెక్టర్ తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆరు నెలలుగా విధులకు హాజరుకాకుండా వేతనాలు?
వసతిగృహ బాధ్యతలు చూస్తున్న ఎఫ్ఏసీ, ఏఎస్ డబ్ల్యుఓ గడచిన ఆరు నెలలుగా విధులకు సక్రమంగా హాజరుకావడంలేదని, అయినా ప్రభుత్వ వేతనం మాత్రం పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కేవ లం సంతకాల కోసమే అప్పుడప్పుడు వచ్చి పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. హాజరు రిజిస్టర్లను తనిఖీ చేస్తే ఈ ఆరోపణల్లో నిజానిజాలు వెలుగులోకి వస్తాయ ని అభిప్రాయపడుతున్నారు.
ఒకే అధికారి పర్యవేక్షణలో రెండు హాస్టళ్లు బిల్లుల్లో గోల్మాల్! :
జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఒకే అధికారికి రెండు వసతిగృహాల పర్యవేక్షణ బాధ్యత లు అప్పగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు హాస్టళ్ల విద్యార్థులకు ఒకే చో ట వంటలు చేయిస్తూ, రెండు వసతిగృహాల పేర్లతో వేర్వేరుగా మెస్ బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులకు చేరని నిత్యావసర సరుకులు:
ప్రభుత్వం విద్యార్థుల కోసం కేటాయిస్తున్న బియ్యం, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు వంటి వస్తువులు అరకొరగానే అందుతున్నాయని, అధిక భాగం ప క్కదారి పడుతున్నాయని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. స్టాక్ రిజిస్టర్లలో నమోదైన వివరాలకు, క్షేత్రస్థాయి నిల్వలకు పొంతన లేదని, డిజిటల్ తనిఖీలు నిర్వహిస్తే అక్రమా లు బయటపడతాయని భావిస్తున్నారు.
కలెక్టర్, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు సమగ్ర విచారణకు డిమాండ్
ఇప్పటికే కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదంటూ మరోసారి కలెక్టర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు కూడా రాతపూర్వక ఫిర్యాదులు అందించినట్లు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఉన్నతాధికారుల పాత్రపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయని, వసతిగృహాల రికార్డులను, మెస్ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు కలక్కుండా చూడాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.