అంతం చేస్తాం!
దద్దరిల్లిన ఢిల్లీ
బీజేపీని వదిలిపెట్టం..
ఓట్ చోర్.. గద్దీ ఛోడ్
ఓట్లు తొలగించడం దేశద్రోహ చర్య
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపాటు
- సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని ఇండీ కూటమి ఆందోళనలు
- పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్‌కు ఎంపీల ర్యాలీ
- అడ్డుకున్న పోలీసులు.. బారికేడ్లు ఎక్కిన రాహుల్
- అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నం
- ఆకాశవాణి భవన్‌కు చేరుకొని నేతల మెరుపు ధర్నా
- జ్ఞానేశ్ వచ్చి, తమ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేదాకా వెళ్లబోమంటూ పట్టు
- రాత్రి 8 దాటినా కదలకపోవడంతో అరెస్ట్ చేసిన పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు(Chief Election Commissioner Gyanesh Kumar) వ్యతిరేకంగా ఇండీ కూటమి చేపట్టిన ఆందోళన లతో మంగళవారం ఢిల్లీ అట్టుడికిపోయింది. పార్లమెంట్(Parliament) నుంచి ఈసీ ఆఫీసుకు(EC Office) దాదాపు 300 మంది ప్రతిపక్ష ఎంపీలు భారీ ర్యాలీ(Opposition MPs hold huge rally) నిర్వహించడం.. పోలీసులు అడ్డుకోవడం.. ప్రతిఘటిస్తూ బారి కేడ్లను ఎక్కి రాహుల్ గాంధీ(Rahul Gandhi) ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ అంటూ నినాదాలు చేయడం.. అక్కడి నుంచి ఆకాశవాణి భవన్‌కు(Akashvani Bhavan) చేరుకొని మెరుపు ధర్నాకు దిగడం.. సీఈసీ వచ్చి తమ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవరకూ కదలబోమనడం.. వంటి పరిణా మాలతో వీధులన్నీ దద్దరిల్లిపోయాయి.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశమంతా ఓట్ చోరీకి పాల్పడుతున్నదని, దీనికి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ సహకరిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు తాము వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. ఓట్ల చోరీ ద్వారా దేశద్రోహ చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని, ఎవరినీ వదిలిపెట్టబోమని, బీజేపీని అంతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ప్రతిపక్ష నేతల ఆందోళనలతో ఉదయం పదిన్నర నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం ఢిల్లీ పరిసరాల్లో కనిపించింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాహు ల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ సహా నేతలను ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మినీ బస్సుల్లో తరలించారు.
సేవ్ డెమోక్రసీ నినాదాలతో..!
‘సేవ్ డెమోక్రసీ’ అంటూ రాసిన బ్యానర్‌తో మంగళవారం మధ్యాహ్నం పార్లమెం ట్ మకర ద్వారం నుంచి ఈసీ కార్యాలయమైన నిర్వచన్ సదన్‌కు ఇండి కూటమి ఎంపీ లు ర్యాలీ చేపట్టారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, చిదంబరం, కేసీ వేణుగోపాల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ (శరద్ పవార్) నా యకురాలు సుప్రియా సూలే, టీఎంసీ లీడ ర్లు సహా దాదాపు 300 మంది ప్రతిపక్ష ఎం పీలు భారీ ర్యాలీ చేపట్టారు. ‘సేవ్ డెమోక్ర సీ.. ఓట్ చోర్, గద్దీ ఛోడ్..’ అంటూ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈసీ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోని జీఎస్టీ భవన్ వద్ద వారిని అడ్డుకున్నారు. ముందుకు వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
బారికేడ్లు ఎక్కిన రాహుల్..
ఈసీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రతిఘటించారు. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి జాతీయ జెండాను చేతిలో పట్టుకొని ఆయన ఎక్కి.. ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందేనని, ఆయనను అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసించారు. తాము సీఈసీని కలిసి వినతి పత్రం ఇచ్చివెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని రాహుల్ ప్రశ్నించారు. కాగా, అక్కడ రాహుల్ సహా ఇండి కూటమి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సులో తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆకాశవాణి భవన్‌లో మెరుపు ధర్నా..
జీఎస్టీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఒక బస్సులో ఎక్కించారు. వారి కండ్లు కప్పి రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతలు నిర్వచన్ భవన్‌కు సమీపంలోని ఆకాశవాణి భవన్ ఆవరణంలోకి వెళ్లారు. అక్కడ మెరుపు ధర్నాకు దిగారు. సుమారు మధ్యా హ్నం 2 గంటలకు ధర్నా ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్‌ను కలిసే వరకు వెనక్కి వెళ్లబోమని అక్కడ బైఠాయించారు. ఎన్నికల కమిషనర్లయినా తమ దగ్గరకు రావాలని, తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించా రు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎన్నికల కమిషన్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ‘మేం ప్రజాప్రతినిధులం. ఎన్నికల కమిషన్‌ను కలవడం మా హక్కు. పోలీ సులు ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అం టూ రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఇది ఆ రంభం మాత్రమేనని, మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, మధ్యాహ్నం 2 గంటలకు ఆకాశవాణి భవన్‌కు ఇండి కూటమి నేతలు చేరుకొని నిర సన తెలిపే దృశ్యాలతో కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో రేడియో న్యూస్ అనుకరణ తో ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘ఆకాశ్‌వాణి సే దోపహెర్‌కే సమాచార్’ అంటూ అందు లో ప్రస్తావించింది.
నేతల అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత..
మధ్యాహ్నం 2 గంటలకు ఆకాశవాణి భవన్ వద్ద రాహుల్ సహా నేతలంతా మెరుపు ధర్నాకు దిగడం, సీఈసీ జ్ఞానేశ్ వచ్చి తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వరకు వెళ్లబోమంటూ పట్టుబట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రాత్రి 8గంటల తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. భవన్ పరిసరాలను ఖాళీ చేయాలని చెప్పారు. అయినా లీడర్లు వినలేదు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ సహా నేతలందరినీ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పార్టీల కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో తోపులాట జరిగింది. మినీ బస్సుల్లో ఎక్కించి ఇతర ప్రాంతాలకు తరలించారు.
ఎవరినీ వదిలిపెట్టబోం: రాహుల్
ఓట్ చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూని చేస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని బీజేపీకి అనుకూలంగా వ్యవస్థను మారుస్తున్నారని, ఇప్పటికే సర్ పేరిట 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని ఆయన దుయ్యబట్టారు. మోదీ, అమి త్‌షాకు జ్ఞానేశ్ సహకరిస్తుంటే.. జ్ఞానేశ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహకరిస్తున్నారని ఆరోపించారు.
ఎవరినీ వదిలి పెట్టబోమని, ఓట్ల దొంగలు గద్దె దిగేవరకు ఉద్యమిస్తామని మంగళవారం ఢిల్లీలో ఆందోళన సందర్భంగా రాహుల్ అన్నారు. ఓట్ల జాబితాలో అవకతవకలకు కారణమైనవారు తప్పించుకోలేరని హెచ్చరించారు. ఓట్ల చోరీతో దేశద్రోహానికి బీజేపీ పాల్పడిందని, ఆ పార్టీని అంతం చేస్తామని చె ప్పారు. జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాల్సిందేనని, ఓటరు జాబితా నుంచి తొల గించిన 13 కోట్ల మంది పేర్ల ను తిరిగి చే ర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
ఈసీకి ఎందుకంత భయం..?
ప్రజాప్రతినిధులుగా తాము 300 మంది ఎంపీలకు ఎన్నికల కమిషనర్లను కలవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవ డం ఏమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించా రు. వ్యవస్థలన్నింటినీ బీజేపీ తన చేతుల్లోకి తీసుకొని.. ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. ‘సీఈసీ జ్ఞానేశ్‌ను మేం కలిసి తీరుతాం. ప్రజల గొంతును వినిపి స్తాం. ఆయన ఓట్ల చోరీకి పాల్పడ్డది వాస్తవమా లేదా అనేది ఆయననే అడిగి తెలు సుకుంటాం..’ అని ఆకాశవాణి భవన్ ఎ దుట మీడియాతో ఆయన అన్నారు. జ్ఞానేశ్‌ను కలుస్తామంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని, ఆయనైనా తమ దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు.
ఇక్కడి నుంచి తమను తరలించి మరోచోట కూ ర్చోబెట్టినా కూర్చుంటాం కానీ, వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. ‘మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్, మోహన్ భగవత్ కలిసి ఎన్నికల వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షంగా మేం పోరాడుతుంటే అడ్డుకోవడం ఏమిటి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, హర్యానా ఎన్నికల్లో జరి గిన అవకతవకలపై మా ప్రశ్నలకు ఈసీ నుంచి ఇప్పటివరకు సమాధానం లేదు. వారు ఓట్ల చోరీకి పాల్పడకుంటే మమ్మల్ని కలవడానికి ఎందుకంత భయం?’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
డ్రింక్ ఇచ్చిన అన్న.. పక్కన పెట్టిన చెల్లి
మంగళవారం మధ్యాహ్నం ఎండలో గంటల తరబడి ఆకాశవాణి భవన్ ఎదుట ఇండి కూటమి నేతలు బైఠాయించారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కాసేపు చెట్టు నీడన సేదదీరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఓ నాయకుడు ఇరవై రూపాయల స్టింగ్ ఎనర్జీ డ్రింక్ బాటిల్‌ను ఇచ్చారు. అందులో నుంచి కాస్త తాగిన రాహుల్, అనంతరం తన చెల్లి ప్రియాంక గాంధీకి తాగేందు ఇవ్వగా.. ఆమె ఆ బాటిల్‌ను పరిశీలించి, వాసన చూసి, పక్కన పెట్టారు.