చిక్కుల్లో ఈసీ

07-10-2026 | 05:30am
  1. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో మరింత ముదురుతున్న ‘సర్’ వివాదం
  2. ఫారం-6లో మార్పులకు తమ ఆమోదం లేదన్న సర్వోన్నత న్యాయస్థానం
  3. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే కొట్టేస్తామని కామెంట్
  4. ఎలాంటి మార్పులు చేయలేదు.. కేవలం డిక్లరేషన్ యాడ్ చేశాం: ఈసీ
  5. సీఈసీ జ్ఞానేశ్‌పై చర్యలు తప్పవా?.. కోర్టు తదుపరి విచారణపై ఉత్కంఠ

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) చుట్టూ వివాదం మరింత ముదురుతున్నది. ఒకవైపు సీఈసీ జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తు ండగా.. మరోవైపు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) తాజాగా చేసిన వ్యాఖ్యల తో ఈసీ చిక్కుల్లో పడింది. ‘సర్’ ప్రక్రియలో('Sir' process) భాగంగా ఫారం-6కు  ఆన్‌లైన్ వర్షన్‌లో ఈసీ యాడ్ చేసిన డిక్లరేషన్ అంశం(Declaration Subject) ఎటు దారితీస్తుందన్నది హాట్ టాపిక్‌గా మారింది.

ఫారం-6లో మార్పులకు తమ ఆమోదం లేదని, అవి ఎవరు చేశారో తేలుస్తామని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే కొట్టేస్తా మని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి మార్పులు తాము చేయలేదని ఈసీ చెప్తున్నప్పటికీ.. ఫారం సెల్ఫ్ డిక్లరేషన్ యాడ్ చేయడం అనేది సవరణగానే ప్రతిపక్షాలు అంటున్నాయి. వచ్చే వారం మళ్లీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నందున ఏం జరుగుతుందన్నది ఉత్కంఠకు దారితీసింది. 

ఆన్‌లైన్ వర్షన్ అసలు సమస్య!

కొత్తగా ఓటు నమోదు చేయించుకునేవాళ్లు ఫారం-6లో తమ వయసు, నివాస వంటి నామమాత్రపు ధృవీకరణలు సమర్పిస్తే సరిపోతుంది. అయితే.. సర్ ప్రక్రియ లో భాగంగా ఈసీ దీనికి అదనంగా సెల్ఫ్ డిక్లరేషన్‌ను ఆన్‌లైన్‌లో పెట్టింది. ఇందులో ‘2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?’ అని ఓ ప్రశ్న ‘మీ పేరు లేకుంటే మీ అమ్మానాన్న, రక్తసంబంధీకుల పేర్లు ఉన్నాయా?’ అని మరో ప్రశ్న ఉంచింది. ఈ  ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ‘తప్పనిసరి కాదు’ అంటూ ఈసీ చెప్తున్నప్పటికీ.. వాటిని పూర్తి చేయకుండా ఫారం-6 సబ్మిట్ చేయలేని విధంగా ఆన్‌లైన్ వర్షన్ రూపొందిం చారు.

దీని వల్ల లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పైగా, ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ‘సర్’  ప్రక్రియ నిర్ణయాలు తీసుకున్నారని, ఫారం  మార్పులు చేశారని వారు అన్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు ఆం దోళన బాటపట్టాయి. సీఈసీ జ్ఞానేశ్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఓటర్లను తొలగించడమే పనిగా సర్‌ను చేపడుతున్నారని మండిపడుతున్నాయి.

ఆయనను తొల గించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అయి తే.. ఇటీవల ఈసీ ఓ ప్రకటన విడుదల చేసిం ది. ఉమ్మడి నిర్ణయాల మేరకే సర్ ప్రక్రియ చేపడుతున్నామని, మార్పులు చేర్పులకు సుప్రీంకోర్టు అనుమతి ఉందని చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూ ర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించి.. మార్పులకు తమ ఆమో దం లేదని స్పష్టంచేసింది. అవసరమైన ఏకాభిప్రాయం లేదా మెజారిటీ లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లు తేలితే వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉందని తేల్చిచెపింది. 

సీఈసీ జ్ఞానేశ్‌పై చర్యలు తప్పవా?

ఫారం-6లో తాము ఎలాంటి మార్పు లు చేయలేదని, సర్ ప్రక్రియ కోసం తగిన డాక్యుమెంటేషన్ విధానాన్ని రూపొందించుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుం దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ ప్రకారమే అదనంగా డిక్లరేషన్ యాడ్ చేశామని, అది తప్పనిసరి కూడా చేయలేదని ఈసీ చెప్తున్నది. అయితే.. ఫారం-6కు డిక్లరేషన్ యాడ్ చేయడమే చట్టవిరుద్ధమని, ఆన్‌లైన్ ఫారం-6ను సబ్మిట్ చేయాలంటే డిక్లరేషన్ పూర్తి చేస్తే కాని ముందుకు వెళ్లడం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.

పేరుకు తప్పనిసరి కాదంటున్నప్పటికీ అది పూర్తి చేస్తే కానీ సబ్మిట్ కాకపోవడం అంటే ‘తప్పనిసరి’ అన్నట్లు కాదా.. అని ప్రశ్నిస్తున్నాయి. ఈ పరిణామ క్రమంలో సుప్రీంకోర్టు కూడా మార్పుల అంశాన్ని ప్రస్తావించడం ‘సర్’ అంశం మరింత వివాదానికి దారితీసింది. రికార్డులను అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

రికార్డులను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏకపక్ష నిర్ణయం తీసుకు న్నట్లు రికార్డులను బట్టి తేలితే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఆయనను విధుల నుంచి తొలగించేలా మ ధ్యంత  ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌ను సుప్రీంకోర్టు పక్కనబెట్టినప్పటికీ.. రికార్డులు పరిశీలించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామనడంతో, తదుపరి విచారణలో జ్ఞానేశ్‌కుమార్ భవితవ్యం ఏమిటన్నది చర్చకు దారితీసింది.

మరిన్ని వార్తలు