16-08-2025 07:54:43 PM
సేవా పురస్కారం అందుకున్న కమిషనర్ శైలజ
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శైలజ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 15 ఆగస్టు, శుక్రవారం నాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి శైలజకు అవార్డును అందజేశారు. కమిషనర్ తో పాటు ఉత్తమ పారిశుధ్య సేవలకు గాను సానిటరీ ఇన్స్పెక్టర్ బి. నారాయణ రెడ్డికి, వార్డ్ స్థాయిలో సేవలకు గాను సరిత అవార్డులు అందుకున్నారు.