calender_icon.png 16 August, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెగిన రోడ్డు

16-08-2025 07:50:11 PM

10 గ్రామాలకు నిలిచిన రవాణా వ్యవస్థ

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదుల్లబంధం, లింగన్నపేట గ్రామాల మార్గ  మధ్యలో రోడ్డు తెగిపోవడంతో పది గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. శుక్ర వారం రాత్రి నుంచి శని వారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తుంతుంగ ప్రాజెక్టు శిఖం నీరు పెద్ద ఎత్తున రావడంతో రోడ్డు మార్గం తెగిపోయింది. గత సంవత్సరం వర్షం కాలంలోనూ వర్షాలకు ఈ రోడ్డు తెగింది. తాత్కాలిక మరమ్మతులు చేయించి చేతులు దులుపుకున్నారు. దీనితో ఇదే సమస్య ఈ ఏడాది సైతం ఉత్పన్నమైంది. 

హామీ ఇచ్చి ఏడాదైనా అలాగే...

ఎదుల్లబంధం, లింగన్నపేట గ్రామాల మార్గ మధ్యలో బ్రిడ్జి నిర్మించి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన హామి అలాగే ఉండిపోయింది. దీనితో ఏదుల్లబందం, సిర్సా, పుల్లగామ, ఆలుగామ, జనగామ, సుపాక, వెంచపల్లి, నందనంపల్లి తదితర గ్రామాలకు నియోజక వర్గ కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది ఎంఎల్ఏ హోదాలో ప్రస్తుత మంత్రి వివేక్ వెంకటస్వామి తెగిన రోడ్డును స్వయంగా పరిశీలించి తాత్కాలిక మరమ్మతులు చేయించి సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామి ఇచ్చారు. కానీ హామీ హామీలాగా మిగిలిపోవడంతో ఒక్క రోజు వర్షానికే తాత్కాలికంగా వేసిన రోడ్డు తెగిపోయింది. ఇప్పటికైనా మంత్రి వివేక్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.