08-07-2025 04:36:15 PM
సిద్దిపేట రూరల్ (విజయక్రాంతి): సిద్దిపేట రూరల్(Siddipet Rural) మండలం తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ స్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బొకే ఇచ్చి శాలవతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో కృషి చేయాలని కోరారు. గ్రామాలలో భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు గరిపల్లి రాములు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్, ఎస్సి సెల్ జిల్లా ఇన్చార్జి కోదాది రమేష్, బీట్ల వెంకట్, సంయుద్దీన్, కిషన్, మహిపాల్ రెడ్డి, కనకయ్య గౌడ్, యాదగిరి, నరేష్, పూజ రాజు తదితరులు పాల్గొన్నారు.