calender_icon.png 2 August, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరు ఏరియాలో 86 శాతం బొగ్గు ఉత్పత్తి

01-08-2025 12:00:00 AM

మణుగూరు, జూలై 31 (విజయక్రాంతి): ఏరియాలోని గనులు జూలై నెలలో 86 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తెలిపారు. గురువారంజీఎం కార్యలయం లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జులై మా సానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడిం చారు. జులై నెలలో 7,58,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా.. 86 శాతంతో 6,51,331 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు.

ఏప్రిల్, 2025 నుండి 31 జులై, వరకు ప్రోగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 36,59, 500 టన్నుల లక్ష్యానికి గాను 39,50,620 టన్నులతో 108 శాతం ఉత్పత్తి సాధించామన్నారు. జులై లో 6, 48, 024 , ఏప్రిల్ జులై వరకు ప్రోగ్రె స్సివ్ గా 39,37,398 టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిం దన్నారు. వార్షిక లక్ష్యాలను సాధించేందుకు అందరి సహకారంతో ముందుకు పోతున్నామన్నారు.

సంస్థలో అధికారులతో పాటు ప్రతి ఉద్యోగి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశం లో డీజీఎం ( పర్సనల్) ఎస్. రమేష్, ఏరియా ఇంజినీర్ శ్రీనివాస్ ,డిజి ఎం (ఫైనాన్స్) శ్రీమతి ఎం అనురా ధా, డివై.సి ఎంఓ జ్యోతిర్మై , అధికారులు శివ ప్రసాద్, శ్రీనివాస్ , రాంబాబు , డి.వి.ఎస్.ఎన్ ప్రవీణ్ , శ్రీనివాస్ రావు, సింగు శ్రీనివాస్,రక్షణ అధికారి వెంకట రామారావుపాల్గొన్నారు.