calender_icon.png 14 October, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లు

14-10-2025 01:51:37 AM

  1. ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓటర్ ఐడీలు
  2. చోరీ ఓట్లతో గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ 
  3. దొంగ ఓట్లను ఎలక్షన్ కమిషన్ తేల్చాలి
  4. ఓటర్ లిస్టుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి
  5. ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు 

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ ఓటు చోరీ అంటుంటే జూబ్లీహిల్స్ ఉప ఎ న్నికలో చోరీ ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ల జా బితాలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల ను తేల్చాలంటూ ఎలక్షన్ కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అడ్డ దారుల్లో ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. మొత్తం రాష్ర్ట మంత్రులంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శిం చారు. 400 ఎన్నికల బూత్‌లో ఒక్కో బూత్ లో 50 దొంగ ఓట్ల చొప్పున కాంగ్రెస్ పార్టీ నమోదు చేసిందని, మొత్తంగా 20వేల దొం గ ఓట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదు చేయించిందని ఆరోపించారు.

ఒక్కొక్క వ్యక్తికి మూడు, నాలుగు ఎన్నికల గుర్తింపు కార్డులు ఉన్నాయని, ఒక్కొక్కరు ఒకటే అడ్రస్‌తో మూడు ఓట్లు, నాలుగు ఓట్లు నమోదు చేయించుకున్నారని చెప్పా రు. ఇలా 20 వేల దొంగ ఓట్లు ఉన్నాయని ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. 15 వేల ఓట్లు కేవలం చిరునామాలు లేకున్నా ఓట్లు నమోదు అయ్యా యని, తమ పార్టీ నేతలు ఆయా ఇళ్లకు వెళ్లి చూస్తే..

23 ఓట్లు ఉన్న ఇంటిలో ఒకటి కూడా తమ వారు లేరని ఇంటి యజమాని చెప్పినట్టు వివరించారు. జూబ్లీహిల్స్‌లో ఓట్లు ఉన్నవాళ్లకి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కయి దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ మొత్తం ఓటర్ లిస్టు అవకతవకల పైన వాటిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని డిమాం డ్ చేశారు. క్షేత్రస్థాయిలో కుమ్మక్కైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల క్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.

కాగా నిధులు లేవని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ బ్యాంకుకి, వార్త పత్రికలకు లేఖలు రాస్తున్న సందర్భంగా జూబ్లీ హిల్స్‌లో మాత్రం భారీగా నిధులు ఉన్నాయని ప్రభుత్వం మరోసారి ప్రజలను మో సం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు.