calender_icon.png 14 October, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనేంటో అందరికీ తెలుసు..

14-10-2025 12:55:14 AM

  1. 71 కోట్ల కాంట్రాక్టుకు తాపత్రయపడే అవసరం నాకు లేదు
  2. సమ్మక్క, సారలమ్మల వంటి అక్కలు సీతక్క, సురేఖ 
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  4. మేడారం అభివృద్ధిపై మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష
  5. ఆహ్వానం ఉన్నా హాజరుకాని మంత్రి కొండా సురేఖ

ములుగు, అక్టోబరు 13 (విజయక్రాంతి): తానేంటో అందరికీ తెలుసు అని, రూ.71 కోట్ల కాంట్రాక్ట్ పనులకు తాపత్రయపడే అవసరం తనకు లేదని రెవెన్యూ శాఖ, వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సమ్మక్క సారలమ్మ ఆలయాభివృద్ధిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. పర్యవేక్షించారు. అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధనిచ్చారు. తనపై నాపై సహచర మ ంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదన్నారు. తానేంటో అందరికీ తెలుసు అని, రూ.71 కోట్ల కాంట్రాక్ట్ పనులకు తాపత్రయపడే అవసరం తనకు లేదని స్పష్ట చేశారు. తనపై ఫిర్యాదు చేయడానికి ఏముందంటూనే అధిష్ఠానానికి ఎవరూ ఫిర్యాదు చేసే అవకాశమే లేదని కొట్టిపారేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని, సమ్మక్క సారలమ్మల వంటి సీతక్క, సురేఖ అక్కలతో ఈ కార్యక్రమాలకు హాజరవుతానని పొంగులేటి చెప్పారు.కాగా మేడారం అభివృద్ధికి రూ.251 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో ఈ జాతరకు కోటి మందికి పైగా వచ్చినట్లు అధికారులు చెప్పారని ఈసారి ప్రభుత్వ అభివృద్ధి చర్యల కారణంగా ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు.

ఇటీవల సీంఎ రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా రూ.101 కోట్లు మంజూరు చేయగా వీటిలో రూ.71 కోట్ల పనులకు టెండర్లు పిలిచినట్టు తెలిపారు. గతంలో మంజూరైన రూ.150 కోట్లతో కలిపి దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఆలయాభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మేడారం జాతరకు వచ్చే నిధులు జంపన్న వాగులో వరదలాగ జారిపోకుండా గిరిజన, గిరిజనేతరుల ఆరాధ్యదైవాల ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరో 50 రోజుల్లో ఎటువంటి ఆటంకం లేకుండా ఒక క్రమపద్ధతిలో సాగేలా కలెక్టర్, ఎస్పీలకు సూచనలు చేశామన్నారు.

ఆహ్వానం ఉన్నా హాజరుకాని కొండా సురేఖ

గత నాలుగు రోజులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా జరిగిన ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. మేడా రం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్ష నిర్వహించడానికి రెవెన్యూ శాఖ, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్క సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో  మేడారానికి వెళ్లారు.

అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉం డటం మంత్రల మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా సమిసిపోనట్లుగానే కనిపిస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారులు కూడా కొం డా సురేఖకు సమీక్షకు రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది.

మంత్రి సురేఖ హైదరాబాద్‌లోనే ఉన్నా మేడారం పర్యటనకు కావాలనే వెళ్లలేదని సురేఖ అనుచరులు చెపుతున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి రూ.70 కోట్ల టెండర్ పనులు సంబంధిత శాఖ మంత్రి సురేఖకు తెలియకుండానే ఎలా బయటికి వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు.