calender_icon.png 14 October, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ నిర్లక్ష్యం..విద్యార్థులకు శాపం

14-10-2025 12:51:26 AM

  1. పాఠశాలకు రావద్దంటున్న యాజమాన్యం

ప్రశ్నార్ధకంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం

కలెక్టర్ సార్... మమల్ని బడికి పంపండి..

తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ ఎదుట పిల్లల ఆవేదన

ఆదిలాబాద్, బోథ్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుం దని, కార్పొరేట్ స్థాయి చదువు లభిస్తోందని చదువుతున్న పాఠశాలల నుండి తీసేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్‌లో వేస్తే ప్రస్తుతం వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.  నిరుపేద ఎస్సీ, ఎస్టీ పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం 2000 2001 సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థుల ఫీజులను ఆయా పాఠశాలలకు ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీంతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులను లక్కిడి ద్వారా ఎంపిక చేసి ఈ కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించారు. ఐతే రెండు సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వం విద్యార్థుల ఫీజులను విడుదల చేసిన, ఆ తర్వాత గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల ఫీజు నిధులు విడుదల చేయకపోవడ ంతో విద్యార్థుల చదువు అర్థంతరంగా ముగియనుందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

1,263 మంది విద్యార్థులు

బెస్ట్ అవైలబుల్ స్కూల్‌ల కింద జిల్లాలో 6 ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో ఆదిలాబాద్ పట్టణములో కృష్ణవేణి,  శ్రీ రాంరెడ్డి, న్యూ ప్రగతి పాఠశాలలు, ఉట్నూర్‌లో పులాజి బాబా, సెంట్‌పాల్, జ్ఞాన సరస్వతి పాఠశాలలు ఉన్నాయి.

ఈ పాఠశాలల్లో మొత్తం 1,263 మంది ఎస్సీ ఎస్సీ విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ట్రైబల్ వెల్ఫేర్ కింద 840 మంది విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్ కింద 423 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రభు త్వం ఫీజు నిధులు విడుదల చేయకపోవడం తో ఆయా పాఠశాలల యాజమాన్యం విద్యార్థులను బడులకు రానివ్వకపోవడంతో ఈ వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

రూ.5.96 కోట్ల బకాయి

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద చదువుతున్న విద్యార్థుల బకాయిలు మొత్తం రూ.5.96  కోట్లు ఉన్నా యి. ఇందులో ట్రైబల్ వెల్ఫేర్  విద్యార్థుల బకాయిలు 4 కోట్ల 50 లక్షలు, సోషల్ వెల్ఫేర్ కింద 1 కోటి 46 లక్షలు బకాయిలు ఉన్నాయి. ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.28 వేల చొప్పున...

5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 47 వేల చొప్పున ప్రభుత్వ మే ఫీజు భరిస్తోంది. అయితే గత మూడేళ్లుగా ప్రభుత్వం ఈ పథకానికి నిధులు మంజూరు చేయకపోవడంతో పథకం ద్వారా చదివే విద్యార్థులను పాఠశాలకు రావద్దని ఆయా పాఠశాలల యాజ మాన్యాలు విద్యార్థులకు హుకుం జారీ చేశాయి.

దీంతో విద్యార్థులు గత దసరా సెలవులకు ఇంటికి వచ్చి ఇంటివద్దె ఉండిపో యారు. పాఠశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే  రావాలని ఖరాఖండిగా చెప్పారని దీంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. తన పిల్లల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కలెక్టరేట్, ఐటిడిఏల ఎదుట నిరసన

మూడేళ్ల నుంచి ఫీజు నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇప్పుడు తమ పిల్లలను పాఠశాలల యాజమాన్యాలు బడికి రానివ్వడం లేదంటూ తన పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు ఉట్నూరు లోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. కలెక్టర్ సార్.. మమ్మల్ని బడికి పంపండి..

అంటూ ప్ల కార్డులను చేతబట్టుకొని విద్యార్థులు కార్యాలయాల ఎదుట బైఠాయించారు. ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనీ,  ప్రభుత్వం వెంటనే కల్పించుకొని తమ పిల్లలను పాఠశాలకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

స్కూల్‌కు రానివ్వడం లేదు..

నేను బెస్ట్ అవ్వలేబుల్ పథకం ద్వారా చదువు కుంటున్నను. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చను. ఇప్పుడు పాఠశాల యాజమాన్యం ఫీజు చెల్లించలేదని స్కూల్‌కు రానివ్వడం లేదు. దీంతో నేను ఇంటి వద్దే ఉన్నాను. ప్రభుత్వం వెంటనే ఫీజు చెల్లిస్తే తాము పాఠశాలలకు వెళ్లి చదువుకుంటాం. 

 శివ కుమార్, 8వ తరగతి

ప్రశ్నార్థకంగా మా చదువులు..

నేను 10వ తరగతి బెస్ట్ అవలేబుల్ పథ కం ఐటిడిఏ ఉట్నూర్ ద్వారా చదువు కుంటున్నాను. ప్రభుత్వం ఐటిడిఏ నుండీ మా పీజులు మూడేళ్ల నుం చి ఇవ్వటం లేదు అని మమ్మల్ని రావ ద్దు అని స్కూల్ యాజమా న్యం అంటున్నారు. నేను పదవ తరగతి చదువుకో వటం ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వం మా పీజులు వెంటనే చెల్లించాలి.

 మెస్రం మౌనిక,  10వ తరగతి