14-10-2025 01:00:01 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో/ముషీరాబాద్ అక్టోబర్ 13 (విజయక్రాంతి ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ అయిన జీవోపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయి. బీసీల హక్కులను కాలరాస్తున్న ఈ తీర్పును వ్యతిరేకిస్తూ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కదిలివచ్చేలా ఈ నెల 18న రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
సోమవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీసీ జేఏసీ నేతలు సమావేశమై, బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ వీజేఆర్ నారగోనితో పాటు పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పులకే విరుద్ద మని మండిపడ్డారు.
బీసీలంటే ఇంత చులకనా, 75 ఏళ్లుగా అన్ని రంగాల్లో అన్యాయాన్ని భరిం చాం, ఇక సహించేది లేదు.. బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఏకమై పోరాడాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాం, అని ఆయ న హెచ్చరించారు. బంద్‌కు అన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లకు గండి కొట్టడానికి, బీసీల నోట్లో మట్టి కొట్టడానికి కొందరు కోర్టులను వేదికగా చేసుకుంటున్నారన్నారు. రాష్ర్టంలో 60 శాతం ఉన్న బీసీల నోటికాడి ము ద్దను పిడికెడు మంది అడ్డుకుంటున్నారన్నారు. రెడ్డి జాగృతి, మాధవ రెడ్డి, గోపాల్ రెడ్డిల ఆధిపత్యాన్ని బొంద పెట్టడానికే ఈ జేఏసీ ఏర్పడింది అనిఅన్నారు.
భవిష్యత్తులో బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసుకునేలా పనిచేస్తామన్నారు. బంద్ కు మద్దతు కోరుతూ అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తామని వారు స్పష్టం చేశారు.బంద్‌కు మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీలకు బీసీల ఓట్లతో బంద్ పెడతామని హెచ్చరించారు.
బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు
బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కొందరు వంకర వంకరగా మాట్లాడుతు న్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రపైన కూడా ఉందని కూనంనేని స్పష్టం చేశారు.
రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ బీసీ జేఏసీ నేతలు సోమవారం హైదరాబాద్ మఖ్ధూం భవన్‌లో కూనం నేని సాంబశివరావును కలిసి లేఖను అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి ప ల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చా డ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొ మ్మగాని ప్రభాకర్, జాతీయ సీనియర్ నాయకులు స య్యద్ అజీజ్ పాషా, ఎమ్యెల్సీ నెల్లికంటి సత్యం నాయకులు డీజీ సాయిలు గౌడ్, నాగభూషణం, మారగోని ప్రవీణ్ పాల్గొన్నారు.