calender_icon.png 31 January, 2026 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

31-01-2026 06:02:10 PM

జడ్చర్ల: జడ్చర్ల కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవాలకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరయ్యారు.  ప్రారంభమైన జాతరలో భాగంగా, శనివారం జరిగిన శ్రీవారి కళ్యాణోత్సవం భక్తులకు కనుల పండుగ చేసింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్యఅతిథిగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ విచ్చేశారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను పలకరించారు శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాక్షించారు.

శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ఎర్ర శేఖర్ దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ.... శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి భావాన్ని పెంపొందించే అద్భుతమైన అవకాశం అని, ఇలాంటి పుణ్యకార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించారు.అనంతరం ఆలయ అర్చకులు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను శాలువాతో సత్కరించడం జరిగింది.