31-01-2026 06:04:55 PM
నంగునూరు,విజయక్రాంతి: మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం నుంచి ఆధార్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. ప్రజల సౌకర్యార్థం కొత్త ఆధార్ నమోదుతో పాటు మొబైల్ నంబర్ మార్పు, బయోమెట్రిక్ నవీకరణ (ఫోటో, వేలిముద్రలు), చిరునామా సవరణలు చేస్తున్నట్లు నిర్వాహకుడు అనంతారం నగేష్ తెలిపారు. ఐదేళ్లు నిండిన పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి అని పేర్కొన్నారు.సేవలు కావాల్సిన వారు తగిన ధ్రువీకరణ పత్రాలతో వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.