అంకిత భావంతో పనిచేశా

19-04-2024 02:24:34 AM

బాగా పనిచేశానని భావిస్తేనే నాకు మళ్లీ ఓటెయ్యండి 

n తెలంగాణకు 10 లక్షల కోట్లు తెచ్చిన

n భూదందాలు, సెటిల్మెంట్లు నా డిక్షనరీలోనే లేవు

n నాపై ఇప్పటివరకు ఒక్క పోలీస్ కేసు కూడా లేదు

n ప్రజలకు నివేదన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

n పదేండ్లలో కేంద్రంనుంచి తెచ్చిన నిధులపై పత్రం విడుదల

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీ, కేంద్ర మంత్రి అయినా అవినీతి ఆరోపణలు, భూదందాలు, సెటిల్మెంట్లు అనేవి తన డిక్షనరీలోనే లేవని, తనపై ఒక్క పోలీసు కేసు కూడా లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటుకు మరోసారి వెళ్లేందుకు సరైన అభ్యర్థినే అని భావిస్తేనే మరోసారి తనకు అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని పింగళి వెంకట్రామారెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు అంకిత భావంతో పనిచేశానని, తనను మరోసారి ఆశీర్వదించి మరోసారి ఎంపీగా ఎన్నుకుంటే ఈ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పదేళ్లలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల కేంద్ర నిధులు తీసుకొచ్చినట్లు ఆయన  వెల్లడించారు.

  కిషన్‌రెడ్డి సంస్కారవంతుడు  

కిషన్‌రెడ్డి ఎంపీగా ఏం చేశారో చాలా వివరంగా చెప్పారు. ఆయన సంస్కారవంతుడు, నిజాయతీ ఉన్న వ్యక్తి. సికింద్రా బాద్ ఓటరుగా కిషన్‌రెడ్డిని చూసి గర్వపడుతున్నా. చేసిన అభివృద్ధిని చక్కగా వివరించారు. ప్రజా సమస్యల పట్ల ఆయన స్పందన బాగుంది. ఆయన పనితీరుకు ఉత్తమ మార్కులు వేస్తాను. ప్రజలు విచక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 

 జయప్రకాష్ నారాయణ, 

లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు

కిషన్‌రెడ్డి తన ప్రగతి నివేదన పత్రంలో వెల్లడించిన వివరాలు

అంశం నిధులు 

(రూ.కోట్లలో)

వైద్యం, ఆరోగ్య సంరక్షణ 3,876

రవాణా మౌలిక సదుపాయాలు 42,833

సైన్స్ అండ్ టెక్నాలజీ 40

విద్య, నైపుణ్య శిక్షణ 1,268

క్రీడలు, ఫిట్‌నెస్ 18

సాంస్కృతికం, పర్యాటకం 563

వివిధ కేంద్ర పథకాల ద్వారా ఇచ్చిన రుణాలు 38,013 

రీజనల్ రింగ్ రోడ్డు 26,000

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 627

అంబర్‌పేట ఫ్లుఓవర్ 266

ఆరాంఘర్ శంషాబాద్ రహదారి విస్తరణ 283

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ 719

చర్లపల్లి రైల్వేస్టేషన్ కొత్త టెర్మినల్ 221

హైదరాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి 336

కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ధి 375

బేగంపేట రైల్వేస్టేషన్ అభివృద్ధి 23

ఔటర్ రింగ్ రైల్ 12,500

రైల్వే మ్యూజియం 40

ఎంఎంటీఎస్ ఫేజ్2 553

ఎంఎంటీఎస్ ఫేజ్ 2 యాదాద్రి వరకు 600

సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు 353

సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ మెడికల్ కళాశాల, దవాఖాన 1,438

సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన 663

బీబీనగర్ ఎయిమ్స్ 1,366

నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ 346

236 బస్తీ దవాఖానల ఏర్పాటు 73

హెల్తీ బేబీ షోతో 7 వేల ఫోషణ్ కిట్ల పంపిణీ 2.5

నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ 30

ఐఐటీ హైదరాబాద్ 1,089

3 కేంద్ర విశ్వవిద్యాలయాలకు 105

సీఎస్‌ఐఆర్, ఐఐసీటీల్లో ఎక్సలెన్స్ కేంద్రాలు 10

ఎన్‌ఐఈఎల్‌ఐటీ ఏర్పాటు 5

సఖి నివాస్ వసతి గృహం ఏర్పాటు 6

ఉస్మానియా వర్సిటీలో 2 ఎస్సీ హాస్టళ్ల నిర్మాణం 30

మహిళా పారిశ్రామికవేత్తల భవనం 22

5 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు 17

ఉస్మానియా వర్సిటీలో క్రీడా కేంద్రాలు 14

కంటోన్మెంట్ పార్క్ 4

హైదరాబాద్ సేఫ్ సిటీ ప్రాజెక్టు 123

కుతుబ్‌షాహీ సర్క్యూట్ అభివృద్ధి 97

ట్యాంక్‌బండ్ వద్ద సౌండ్ అండ్ లైట్ షో 45

గోల్కొండ కోట, ఓయూ సౌండ్ అండ్ లైట్ షో 12

గోల్కొండ కోట అభివృద్ధి పనులు 16

అబిడ్స్‌లో రామ్‌జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం 25

చార్మినార్ అభివృద్ధి కోసం 3

మింట్ కాంపౌడ్ అభివృద్ధి పనులు 5

ఎపిగ్రఫీ మ్యూజియం 20

సంగీత నాటక అకాడమీ కల్చరల్ సెంటర్ 25

సైన్స్ మ్యూజియం 233