బల్దియాలో కీచక కాంట్రాక్టర్

23-04-2024 02:20:07 AM

ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులపై వేధింపులు 

కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలు 

విచారణకు ఆదేశించిన కమిషనర్ 

ఏజెన్సీ రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిప ల్ కార్పొరేషన్‌లో ఓ కాంట్రాక్టర్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. తన ఏజెన్సీలో నియామకమైన మహిళా ఉద్యోగులపై వేధింపు లకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదులు అందుతున్నాయి. బల్దియాలో 20 ఏండ్లుగా పాగా వేసుకున్న ఆ కాంట్రాక్టర్ ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు సమయం కానీ సమయంలో ఫోన్లు చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. గతంలో మేయర్ మందలించినా బుద్ది మార్చుకోక తన కీచక పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు న్యాయం చేయాల ంటూ ఓ మహిళా ఉద్యోగిణి 20వ తేదీన కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. 

రూ. 50వేలకు పైగానే... 

క్షేత్రస్థాయిలో పారిశుధ్య కార్మికుల నుంచి కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేట ర్లు వరకు కాంట్రాక్టర్ల నుంచి తీవ్రమైన మానసిక ఇబ్బందులతో మహిళలు సతమతం అవుతున్నారు. శ్రీదుర్గాభవాని ఎంట ర్‌ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా నియామకం అవుతున్న ఒక్కో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నుంచి రూ. 50వేలకు పైగానే డబ్బులు లాగుతున్నట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో విభా గాధిపతులకు సైతం వాటా అందుతోందనే విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా, 20 ఏండ్లుగా ఏజెన్సీ నడుపుతూ ప్రధాన కార్యాలయం నుంచి సర్కిల్ కార్యాలయాల దాకా బల్దియాలో తన ఇన్ఫార్మర్ల వ్యవస్థను పటిష్టపర్చుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే సదరు కాంట్రాక్టర్‌కు బల్దియాలో ఆడిందే ఆట, పాడిందే పాటగా తన వికృత చేష్టలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 

రమ్మన్న చోటుకు రాకుంటే.. 

శానిటేషన్ విభాగంలో మహిళా ప్రొఫైల్స్‌ను పరిశీలించి నచ్చిన వారిపై ఓ కన్నెయ డం తంతుగా మార్చుకున్నాడు. ఇంటర్వ్యూ నుంచి ఉద్యోగంలో చేరే దాకా సదరు మహిళలతో టచ్‌లో ఉంటున్నాడు. ఉద్యోగంలో చేరిన అనంతరం ఫలానా చోటకు రావాలం టూ ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న ట్టు ఓ బాధితురాలు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారి వ్యక్తిగత అవసరాలు, బలహీనతలు తెలుసుకుంటూ రాత్రి సమయంలో నూ సదరు ఉద్యోగునులకు ఫోన్లు చేస్తున్నట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురి మహిళలు కాంట్రాక్టర్ డిమాండ్‌కు కమిట్ అవుతున్నట్టు సమాచారం. ఇష్టం లేని మరికొందరు అసలు ఉద్యోగాలే మానేసినట్టుగా విశ్వాసనీయ సమాచారం. రమ్మన్న చోటుకు వెళ్లకుంటే నెలవారీ వేతనం నిలిపివేయంతో పాటు కులం పేరుతో దూషిస్తూ కక్ష సాధిం పు చర్యలకు దిగుతున్నట్టుగా బాధితులు పేర్కొన్నారు. ఈ కీచకుడికి లొంగిపోవడానికి ఇష్టపడని ఓ ఉద్యోగినీ కమిషనర్‌కు ఫిర్యా దు చేశారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బల్దియాలో కీచక కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సదరు ఏజెన్సీని రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


జీహెచ్‌ఎంసీలో 40 మందిపై కొరడా

ఎన్నికల శిక్షణకు  గైర్హాజరైనందుకు క్రిమినల్ కేసులు 

ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన పలువురు ఉద్యోగులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల విధులకు మొత్తం 23,500 సిబ్బంది అవసరమని భావించగా, 2,700 మంది శిక్షణకు హాజరు కాలేదని రోనాల్డ్ రోస్ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీరిపై జిల్లా ఎన్నికల అధికారి క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు కాగా, తాజాగా మరో 30 మందిపై కేసుల నమోదుకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా వారిపై సస్పెన్షన్ ఉత్తర్వ్యులు జారీ చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ప్రతిపాదన లేఖలను పంపారు.