calender_icon.png 16 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన ధరల ప్రకారం డీఏ ఇవ్వాలి..

16-09-2025 01:12:16 AM

కోల్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం.. 

ముషీరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాం తి): పెరిగిన ధరల ప్రకారం డీఏ ఇవ్వాలని కోల్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ కల్వల లక్ష్మణ్, సర్వజిత్ కోదార్, మహేశ్వర్‌లు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పెన్షనర్లకు పెన్షన్ తక్కు వ ఉండడం వల్ల సరైన వైద్యం అందక లక్ష మందికి పైగా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచినప్పుడల్లా ఈపీఎఫ్ పెన్షనర్స్‌కు పెరుగుతుంద ని, కానీ సీఎంపీఎస్ పెన్షనర్స్‌కు పెరగడం లేదన్నారు. నెలకు కనీస పెన్షన్ పదివేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బొగ్గు గనుల సీఎండీ ప్రసాద్‌లకు పలుమార్లు కలిసి వినతి పత్రం అందజేశామన్నారు.