calender_icon.png 16 September, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలను దశలవారీగా విడుదల చేయాలి

16-09-2025 01:22:56 AM

-లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తాం

-ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్‌కు మద్దతు

-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ తలపెట్టిన ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్‌కు బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తున్నట్టు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం అమరవీరుల స్థూపం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని హితవుపలికారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. నాలుగేళ్లుగా రూ.8,000 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యా లు ఆందోళనకు గురవుతున్నాయని, కాలేజీల బంద్‌తో రోడ్డునపడ్డ 14 లక్షల మంది విద్యార్థుల గోసను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. దీన్ని ప్రవేట్ కళాశాల యజమాన్యాల సమస్యగా చూడొద్దని, ఇది లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిందిగా చూడాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే రాష్ర్ట ప్రభుత్వం ఫీజు బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని, లేకుంటే రాష్ర్టవ్యాప్తంగా బీసీ విద్యార్థులతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు.