calender_icon.png 16 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో మెడికవర్ విస్తరణ

16-09-2025 01:21:25 AM

  1. సికింద్రాబాద్, కోకాపేటలో కొత్త ఆస్పత్రులు

చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న మెడికవర్ హాస్పిటల్ విస్తరణ బాట పట్టింది. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో రెండు ప్రాంతాల్లో కొత్త గా 2 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ఏర్పా టు చేస్తోంది. ఒకటి సికింద్రాబాద్‌లో, మరొకటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కోకాపేటలో అందు బాటులోకి రానున్నాయి.

సికింద్రాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణం పూర్తికాగా.. మంగళవారం ప్రారంభం కానుంది. మెడికవర్‌కు ఇది 24వ హాస్పిటల్ అవుతుంది. మెడికవర్ రూ.100 కోట్లతో ఈ హాస్పిటల్‌ను నిర్మించింది. దాదాపు 300 బెడ్స్ కెపాసిటీతో ఈ హాస్పిటల్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే మెడికవర్.. తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహరాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మెడికవర్ హాస్పిటల్ రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా నిర్దేశించుకుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ తెలిపారు.

ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటలో నిర్మాణంలో ఉన్న హాస్పిటల్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్‌ను 500 బెడ్స్ కెపాసిటీతో నిర్మిస్తున్నట్లు వివరించారు. మెడికవర్‌కు ఇది 25వ హాస్పిటల్ కానుంది. ఇంకా ఇందులో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ హాస్పిటల్ నిర్మాణానికి రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు.

అలాగే మెడికవర్ ఐపీవో అంశంపై కూడా అనిల్ కృష్ణ స్పందించారు. వచ్చే ఏడాదిలో ఐపీవోకు వస్తాయని స్పష్టం చేశారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను హాస్పిటల్స్ విస్తరణ, రుణ భారం తగ్గింపు వంటి వాటికి ఉపయోగిస్తామని అన్నారు. కాగా కంపెనీకి దాదాపు రూ.1,000 కోట్ల మేర రుణ భారం ఉందని చెప్పారు. టైర్ 2 పట్టణాలు సహా మెట్రో సిటీలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలిపారు. ఇతర చిన్న హాస్పిటల్స్‌ను టేకోవర్ అనేది ఉండదని,

అయితే మంచి అవకాశం ఉంటే పరిశీలిస్తామని తెలిపారు. అలాగే భూమి కొనుగోలు చేసి హాస్పిటల్స్ ఏర్పాటు అంశం గురించి ఆలోచిస్తున్నామని, ఇది క్షేత్ర స్థాయి సాధ్యసాధ్యాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో చూస్తే బెంగళూరు, పుణే వంటి నగరాల్లో విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న హాస్పిటల్ కెపాసిటీని మరింత పెంచుతామని, కొత్తగా 150 బెడ్లను యాడ్ చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే అన్ని హాస్పిటల్స్‌లో బెడ్ల సంఖ్య 6,400 వరకు చేరుకుంటుందని తెలిపారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంశంపై కూడా ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో హెల్త్‌కేర్ రంగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

ఏఐతో రోగులకు మెరుగైన సేవలు అందించొచ్చని అభిప్రాయపడ్డారు. తమ హాస్పిటల్స్‌లో డాక్టర్ల నిర్ణయమే అంతిమం అని, అందులో మేనేజ్మెంట్ కలుగజేసుకోదని, రోగులకు ఎంత వరకు ఏ సేవలు అవసరమో.. వాటినే అందిస్తామని భరోసా కల్పించారు.