calender_icon.png 16 December, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు సంబరాలు పక్కన పెట్టి... కన్నీటిని తుడిచిన ‘మంచి మనసు’

15-12-2025 01:27:26 AM

  1. గెలిచిన రెండ్రోజులకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘మొండికుంట‘ నాయకురాలు

ఓటు వేసిన ప్రజలకు కష్టం వస్తే.. నేనున్నానంటూ ముందుకొచ్చిన సర్పంచ్

అశ్వాపురం, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రాజకీయాల్లో హామీలు ఇవ్వడం చాలా సులభం.. కానీ గెలిచిన తర్వాత ఆ హామీలను గుర్తుపెట్టుకోవడం కొందరికే సా ధ్యం. ‘నేను ఉన్నాను‘ అని భరోసా ఇవ్వడమే కాదు, గెలిచిన 48 గంటల్లోనే ఆ మాట ను చేతల్లో చూపించి, రాజకీయ నాయకత్వానికి కొత్త నిర్వచనం చెప్పారు మొండికుంట గ్రామ సర్పంచ్ మర్రి సంధ్య మల్లారెడ్డి. మొండికుంట గ్రామంలో వెల్డర్ పని చేసుకుని జీవించే సిరసవాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే కొత్తగా ఎన్నికైన సర్పంచ్ సంధ్య మల్లారెడ్డి చలించిపోయారు.

ఎన్నికల ప్రచారంలో ఆమె ఒక మా ట ఇచ్చారు.. ‘గ్రామంలో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే, వారి అంత్యక్రియల ఖర్చుల కోసం నా వంతుగా రూ. 10,000 తక్షణ సాయం అందిస్తాను‘ అని. గెలిచి కేవలం రెండు రోజులే అయ్యింది. ఇంకా ప దవీ బాధ్యతల హడావిడి, విజయటోపాలు ముగియలేదు. అయినా, ఆమె ఇచ్చిన మా టను మర్చిపోలేదు. వెంటనే శ్రీనివాస్ ఇం టికి వెళ్లి, మృతదేహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు.

కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులను ‘నేనున్నాను‘ అంటూ ఓదార్చారు. ఆపదలో ఉన్న ఆ కు టుంబానికి, తాను వాగ్దానం చేసిన రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అక్కడికక్కడే అం దించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్య మల్లారెడ్డి మాట్లాడిన మాటలు అక్కడున్న వారిని కదిలించాయి. ‘నన్ను సర్పంచ్గా కాదు, మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించారు. కష్టంలో ఉన్నవారికి తోడుగా నిలబడటమే నా బాధ్యత.

మాట ఇచ్చాం.. ఆ మాటకు క ట్టుబడి ఉంటాం. చెప్పింది చేసి చూపిస్తాం,‘ అని ఆమె ఉద్ఘాటించారు. పదవి రాగానే ప్ర జలకు దూరమయ్యే రోజుల్లో.. గెలిచిన వెంటనే కష్టాల్లో ఉన్న కుటుంబం చెంతకు చే రిన సర్పంచ్ సంధ్య మల్లారెడ్డి చిత్తశుద్ధిని చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. ఆమె సేవా దృక్పథం నేటి యువ నాయకులకు ఒక స్ఫూర్తి పాఠం.