calender_icon.png 22 December, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర.. రేవంత్ రెడ్డిది

22-12-2025 01:54:58 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు(BRS MLA Harish Rao) మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ మాట్లాడారని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని పలువురు ప్రశంసించారు. గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణను టోనీ బ్లేయర్, సుబ్బారావు ప్రశ్నించారు. కేసీఆర్ పాలన గురించి రేవంత్ రెడ్డి పిలిచిన అతిథులే ప్రశంసించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో దేశానికి తలమానికంగా నిలిపారని హరీశ్ రావు స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మూడురెట్ల జీఎస్ డీపీ, తలసరి ఆదాయం పెరిగిందన్నారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయవద్దని హరీశ్ రావు హెచ్చరించారు. సొంతపార్టీ నేతలనే తొక్కుకుంటూ పెరిగినట్లు రేవంత్  రెడ్డి స్వయంగా చెప్పారని, రూ. 50 కోట్లు పెట్టి పీసీసీ పదవి కొనుగోలు చేసినట్లు కోమటి రెడ్డి అన్న విషయాన్ని ప్రస్తావించారు. నిజాయితీగా త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం తమదన్నారు. పుట్టుక, చదువు, నౌకరు ఒకదాంట్లో చేస్తున్నారు.. రేపు ఎక్కడో తెలియదన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యాగాలు చేసిన చరిత్ర తమదన్న హరీశ్ రావు వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర రేవంత్ రెడ్డిది అన్నారు. రేవంత్ రెడ్డి చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడని హరీశ్ రావు స్పష్టం చేశారు.