13-05-2025 12:07:03 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు మే 12 (విజయక్రాంతి) రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో రూ 20 కోట్ల తో నూ తనంగా నిర్మించనున్న పలు సిసి రోడ్లకు, డ్రైనేజ్ లకు ఆయన శంకుస్థాపన చేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని అరుంధతి నగర్, సుందరయ్య నగర్, వినాయక నగర్, బాలాజీ నగర్, భగత్ సింగ్ నగర్‌లో రూ 20 కోట్ల తో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీలు, సీసీ రోడ్లకు, కొబ్బరికా య కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మారుమూ ల గ్రామాల అభివృద్ధికీ కట్టుబడి ఉందన్నారు.
గ్రామాల్లో, మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక నిధులు మంజూరు చేయించి పినపాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు o9 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి శ్రీనివాసరావు మీ, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , నియోజవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, తరుణ్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ , టౌన్ అధ్యక్షులు శివ సైదులు , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.