21-10-2025 06:25:50 PM
పెద్ద ఎత్తున టపాసుల పేల్చివేత..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): దీపావళి పండుగ వేడుకలను ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. అలాగే వ్యాపారులు, గృహవాసులు ధనలక్ష్మి, కేదారీశ్వరి పూజలు నిర్వహించారు. దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి... పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. స్వీట్లు పంచారు. సుల్తానాబాద్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ దీపావళి పండుగ వేడుకలను రెండు రోజులపాటు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.