calender_icon.png 5 September, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుత దాడిలో లేగదూడ హతం

04-09-2025 12:00:00 AM

సిర్గాపూర్, సెప్టెంబర్ 3 :సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివారులో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. నాయకుని తుకారాం అనే రైతు రోజులాగే తన పొలంలోని బర్రెల షెడ్డులో కట్టివేసిన లేగ దూడను చిరుతపులి చంపి రక్తం తాగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుత అనవాళ్ళను గుర్తించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతు నాయకుని తుకారాం కోరారు.