04-09-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): ఇక్కడ అంతా సిని మా స్క్రిప్ట్ మాదిరిగా నడుస్తుంది. కబ్జాదారులకు, రెవె న్యూ అధికారులకు మధ్యన బలమైన అవగాహన ఒప్పం దం కుదరడంతో ప్రభుత్వ స్థలా ల రక్షణ గాలిలో దీపంలా మారిం ది. మాకు కాసులు ముట్ట చెబితే సరి మీ ఇష్టం ఎంతైనా ప్రభుత్వ స్థలాలు లూటి చేయండి పర్వాలేదు అనేలా ఉంది ఇక్కడి రెవెన్యూ అధికారుల తతంగం.
రెవెన్యూ అధికారులకు, కబ్జా దారులకు బలమైన బంధం కొన్ని సంఘటనలలో చెప్పకనే అర్థం అవుతుంది. క్విడ్ ప్రో ఒప్పందాలను తల దన్నేలా ఉన్న ఈ రెవెన్యూ యంత్రాంగం లీలలు స్థానికులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. వివరాలలోకి వెళ్లితే.... కుత్బుల్లాపూర్ మండ లంలోని గాజులరామారం సర్వే నెంబర్ లలో గల ప్రభుత్వ స్థలాల కబ్జాలు రోజుకో చోట హాట్ టాఫిక్‌గా నిలుస్తాయి.
గత కొన్నే ళ్ల క్రితం ఈ మండలంలో వం దల కొద్ది ఎకరాలు ప్రభుత్వ భూమి అధికారుల ధన దా హానికి కర్పూరంలా కరిగిపోయింది. మీకింత మాకింత అం టూ మరీ వాటాలు వేసి కబ్జాదారు లు, రెవెన్యూ అధికారులు పంచుకు తిన్నారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో జరిగిన ఇక్కడి కబ్జాలలో కొందరు భూ మాపియా డాన్‌లు ఆరి తేరి రూ.వందల కోట్లు కూడ బెట్టారు. అందులో అధికారుల వాటా కూడా తక్కువేమాత్రం కాదు. అలా మొదలైన కబ్జాల ఆట కుత్బుల్లాపూర్ మండలంలో జరుగుతూనే ఉంది.
హైడ్రా అధికారుల మౌనం... సన్న గిల్లుతున్న నమ్మకం...
గాజులరామారం సర్వే నెంబర్ 329 లోని ప్రభుత్వ స్థలంలో కొందరు భూ కబ్జాదారులు ధర్జాగా రియల్ పంట పండిస్తు న్నారు. మహానగరం లో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేస్తే హైడ్రా రంగం లోకి దిగి యాక్షన్ తీసుకుంటుంది. కూల్చివేత చేపట్టి కేసులు నమోదు చేస్తుంది. ఇది మొన్నటి వరకూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడిన మాట. కానీ నేడు హైడ్రా చర్యలు ప్రజ ల్లో ఏమాత్రం విశ్వాసం ఉంచుకోవడం లేదు అనే విమర్శలు విలువడుతున్నాయి.
లోకల్ గా ఉన్న రెవిన్యూ యంత్రాంగం కబ్జా దారులతో కుమ్మక్కు అవుతూ కబ్జాలకు వత్తాసు పలుకుతే హైడ్రా ఎంటర్ అవుతాది... కబ్జా దారుల తాట తీస్తాది... అనే నమ్మకం ఇక్కడి కబ్జాలు.... రెవిన్యూ అధికారుల తీరు చూస్తే హైడ్రా పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది అనే అనుమానం కలుగుతుంది. అయితే గాజులరామారం సర్వే నెంబర్ 329 లోని ప్రభుత్వ స్థలం లో చింతల్ చెరువును ఆనుకుని కొందరు కబ్జాలు చేస్తున్నారు.
రాత్రి వేలలో ట్రాక్టర్స్ ద్వారా మట్టిని పూడ్చి అక్రమంగా ప్రభుత్వ స్థలాలలో గదులు నిర్మించి అమాయకులకు, పేదలకు అమ్మి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం గత కొద్ది రోజుల క్రితమే విజయక్రాంతి లో వార్త ప్రచురించడం జరిగింది.అయితే ఇదే కబ్జా వార్తను తర్వాత కొన్ని ప్రధాన పత్రికలు సైతం ప్రచురించడంతో కుత్బుల్లాపూర్ మండలం రెవెన్యూ ఆర్‌ఐ ఖలీమ్ కూల్చివేతకు తాను వెళ్లినట్లు...
అక్కడి మహిళలు తనని అడ్డుకున్నట్లు పత్రిక రిపోర్టర్స్ కు ఓ వీడియో పంపాడు. ఆ వీడియో ద్వారా తనది తప్పే మి లేదని కబ్జాలు అరికట్టేందుకు తాను, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ చిత్త శుద్ధితో పనిచేస్తున్నట్లు నమ్మించేందుకు మీడియా ప్రతి నిధులకు, రెవెన్యూ ఉన్నతధికారులకు పంపినట్లు అర్థం అవుతుంది. కానీ అక్కడ వెలసిన గదులను కూల్చివేత చేపట్టడం లో రెవెన్యూ ఆర్‌ఐ ఖలీం కీ, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కు ఏమాత్రం ఇష్టం లేదన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
మా రూములు కూల్చేందుకు వస్తే జేసిబీ డ్రైవర్ ను పెట్రోల్ పోసి తగుల బెట్టేస్తాం, మీరూ ఇక్కడికి రావొద్దు అంటూ రెవెన్యూ అధికారులను కబ్జాదారులు మహిళలను అక్రమ గదులలో ఉంచి బెదిరించినట్లు నటించడం స్థానికులను ఆశ్చ ర్యచకితులను చేసింది. అయినప్పటికీ ఆర్‌ఐ, తహసీల్దార్ అక్రమ గదులను కూల్చడంలో నాన్చుడు ధోరణి అవలంభించడం స్థానికుల విమర్శలకు బలం చేకూర్చుతుంది.
పోలీస్ ఫోర్స్ లేక అక్రమ గదులు కూల్చలేదు... తొందరేం ఉంది
సర్వే నెంబర్ 329 లోని ప్రభు త్వ స్థలంలో వెలసిన అక్రమ గదు లను ఎందుకు కూల్చలేక పోయారు... మీ రెవెన్యూ ఆర్‌ఐని కబ్జాదారులు అడ్డుకుని, మీ సిబ్బందిని తగులబెట్టేస్తాం అని బెదిరింపులు చేసినా ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు అని విజయక్రాంతి ప్రతినిధి కుత్బుల్లాపూర్ తహసీ ల్దార్ సుజాతను వివరణ కోరగా పోలీ స్‌లు బిజీగా ఉన్నారు, అందుకే కేసు పెట్టలేదు. అక్రమ నిర్మాణాలను కూల్చలేదు. చూద్దాం మస్తు టైమ్ ఉం ది తొందరెందుకు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది.
సుజాత, తహసీల్దార్, కుత్బుల్లాపూర్