17-08-2025 01:21:33 AM
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాను సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రియాంక అరుళ్ మోహన్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేశారు.
ఆమె పాత్రను ‘కన్మణి’గా పరిచయం చేశారు. ఒక పోస్టర్‌లో ప్రియాంక లుక్.. దయ, బలం, నిశబ్దాన్ని ప్రదర్శిస్తుంటే.. మరో పోస్టర్ ప్రశాంతత, గృహ వాతావరణాన్ని సూచిస్తోంది. నిర్మాతలు.. ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అని అభివర్ణిస్తున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; డీవోపీ: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస; కూర్పు: నవీన్ నూలి.