calender_icon.png 17 August, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేర్యాలలో క్షుద్ర పూజల కలకలం

17-08-2025 12:39:08 AM

పోలీసులకు షాపు యజమాని ఫిర్యాదు 

చేర్యాల, ఆగస్టు 16: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం కిరాణా దుకాణం ముందు క్షుద్రపూజలు చేసిన ఘటన వెలుగు చూసింది. చేర్యాల కొత్త బస్టాండ్ సమీపంలో గల ఓ కిరాణా దుకాణం ముందు దుకాణం నిర్వాహకుల దంపతుల ఫొటో, కోడిగుడ్లు, నల్లని బొమ్మ, కుంకుమ, పసుపు కలిపిన అన్నం పెట్టారు. భయభ్రాంతులకు గురైన దుకాణం యజమాని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.