calender_icon.png 6 September, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ద్రత, ఆగ్రహాల కలబోత

06-08-2024 12:00:00 AM

నేడు ప్రజాకవి గద్దర్ వర్ధంతి :

ప్రజా సమస్యలపై గొంతెత్తిన ‘ప్రజా యుద్ధనౌక’ దివికేగి ఏడాది అయ్యింది. ప్రజా వాగ్గేయకారు డు, ప్రజాకవి, కళాకారుడుగా తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చి న ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి అప్పుడే సంవత్సర కాలమైంది. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు.

మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1949లో ఆయన జన్మించారు. గతేడాది ఆగస్టు 6న తను వు చాలించారు. దాదాపు యాభై వసంతాలకు పైగా ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట, పాటలతో ఊపిరి నింపిన విప్లవకారుడు. నక్స ల్బరీ, తెలంగాణ, దళిత బహుజన, సాం స్కృతిక సహా అనేక ఉద్యమాలలో తన పాటలతో ప్రజా జీవితాలను ప్రభావితం చేశారు.

ప్రభుత్వాలను కదిలించారు. ‘బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి’ అని రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ విమోచనం కోసం గళమెత్తారు.

1980లో చాలా ఇళ్లల్లో ‘భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న’ పాట, ‘మదన సుందరి’, ‘భారతదేశం భాగ్య సీమరా సకల సంపదలు గల్ల దేశమున దరిద్ర మెట్లుందో నాయన, చుండూరు దళితుల ఊచకోతకు వ్యతిరేకంగా ‘జ్ఞానం ఒక్కరి సొత్తు కాదన్న అది సర్వజాతుల సంపదోరన్న’, ‘దళిత పులులమ్మా’ వంటి పాటలు ప్రజలలో అసా ధారణ రీతిలో నినదించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. 

ఆ గానం అనితర సాధ్యం

నిజామాబాద్, హైదరాబాద్‌లలో గద్దర్ విద్యాభ్యాసం సాగింది. 1975లో కొద్ది కాలం కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన పాటలు ఎంతటి ప్రభావం చూపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యమం అప్పటి దాకా ఒక ఎత్తు, ఆయన పాట తర్వాత మరొక ఎత్తుగా కొనసాగింది.

గద్దర్ ఆట|వూ కోట్లాది మందిని కదిలించింది. జనం గోసను పాటలద్వారా ఆర్ద్రత, ఆగ్రహంతో ఆయ న వినిపించిన తీరు అనితర సాధ్యం. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’ పాటకుగాను నంది అవార్డుకు ఎంపికయ్యారు గద్దర్. కానీ, దానిని స్వీకరించేందుకు అంగీకరించలేదు. పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గొంతు వినిపించారు గద్దర్.

విలక్షణమైన గళంతో కోట్లాదిమంది ప్రజలను ఉత్తేజ పరిచారు. దేశంలో దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంత పోరాటమే జరిపారు. చాలామంది సానుభూతిపరులు, పౌర ప్రజా సంఘాలు, మానవ హక్కులు, మహిళలు, దళిత బహుజనుల సంఘాలలో సాంస్కృతిక విప్లవం తెచ్చిన మహోన్నత వ్యక్తి గద్దర్.

అయన పాటలతో ఉత్తేజమై ఎందరో నక్సల్ ఉద్యమంలో చేరారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆనాడు మరణం అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. 

1969 తెలంగాణ ఉద్యమంలోనూ అత్యంత చురుగ్గా పాల్గొన్న గొప్ప చరిత్ర వారిది. భావజాల వ్యాప్తికోసం ఊరూరా తిరిగి బుర్రకథలతో ప్రచారం చేసేవారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు.. భగత్‌సింగ్ జయంతి రోజున ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు.

1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్ ‘ఆపర రిక్షా’ పేరుతో తన మొదటి పాట వెలువరించారు. ఆయన మొదటి ఆల్బం పేరు ‘గద్దర్’. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. రాజ్యాంగ సంక్షోభానికి వ్యతిరే కంగా, సామాజిక తెలంగాణ స్వప్నం నెరవేరలేదని, ఎంతో కాలంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం కొందరి చేతుల్లోనే ఉందనేవారు.

ముప్పు సంవత్సరాల కిందట మహాబోధి  విద్యాలయం ఏర్పాటు చేసి, ఎందరో విద్యార్థులకు విద్యాప్రదానం చేసిన సహృదయులు. తెలుగునేలపైన ప్రజాకళలు ఉన్నంత వరకు గద్దర్ పాట సజీవంగా ఉంటుంది.   

 డా.యం.సురేష్‌బాబు