బీజేవైఎం పోరాట కమిటీ ఏర్పాటు
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌ల కోసం నిర్ణయం
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌ల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ప్రత్యేక పోరాట కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ అధ్యక్షతన గురువారం ఈ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో షా శరత్ చంద్రను కన్వీనర్‌గా నియమించగా, సందీప్ గౌడ్, నిఖిల్ నాయక్, సాయినాథ్లను కో- నియమించారు.
అలాగే అరవింద్ రెడ్డి, శివ చంద్రగిరి, వరప్రసాద్ రెడ్డి, హరి ప్రసాద్, హుస్సేన్, సంతోష్ యాదవ్, రాజేందర్ రెడ్డి, రామకృష్ణ ఇంటూరు, మనోహర్ గౌడ్, కొండ సాయి, విక్రమ్ సింగ్, శివకాంత్ సుచిత్‌లను సభ్యులుగా నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌ల సమస్యలపై ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, విద్యార్థుల తరఫున పోరాట కార్యక్రమాలను సమన్వయం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది.






