calender_icon.png 28 December, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ

28-12-2025 12:50:12 AM

  1. 22 మంది ప్రయాణికులకు గాయాలు
  2. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం
  3. సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఘటన 

సంగారెడ్డి, డిసెంబర్ 27(విజయక్రాంతి) :ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో సుమారు 22 మంది ప్రయాణికులు గాయాలపాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సంగారెడ్డి నుంచి పటాన్‌చెరు వెళ్తూ కంది సమీపానికి రాగానే డ్రైవర్ వేగంగా ఆగివున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు.

ప్రమాదసమయంలో బస్సులో 60 మంది ప్రయాణి కులు ఉన్నారు. ఈ ఘటనలో22 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్సు ద్వారా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే బస్సు ఓ స్కూటర్‌ను ఢీకొట్టడంతో గాయాలు కావడంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి నట్లు తెలిసింది. కాగా గాయపడ్డ ప్రయాణికులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో బాధితు లకు స్కానింగ్ చేయడానికి కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.