calender_icon.png 24 October, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవుల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలి

24-10-2025 12:18:38 AM

వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణలో గోవుల అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీస్ యం త్రాంగం ఉక్కుపాదం మోపాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. భాగ్యనగర్ శివారు ఘట్‌కేసర్ వద్ద గోరక్షకుడిపై కాల్పులకు తెగబడిన ఇబ్రహీం, అతడి ముఠాను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వీహెచ్‌పీ రాష్ర్ట ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి గురువారం ప్రకటనలో డిమాండ్ చేశారు.

రాష్ర్టంలో కొందరు జిహాదీ మూకలు మారణాయుధాలతో స్వేచ్ఛగా తిరుగుతూ అత్యం త క్రూరంగా వ్యవహరిస్తున్నా, పోలీస్ యం త్రాంగం సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. గో హంతకులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, కాల్పులు జరిపిన ఇబ్రహీం వెనుక ఉన్న ముఠా నెట్‌వర్క్‌ను బయటపెట్టాలని కోరారు. హిందు వుల మనోభావాలను దెబ్బతీస్తూ గోహత్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని, గోహత్య నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బాలస్వామి డిమాండ్ చేశారు.