24-10-2025 12:16:42 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ నడుస్తలేదని, రేవంతుద్దీన్ ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ఎంఐఎం గూండాలను కాపాడటానికే రేవంత్ సర్కార్ ఉందన్నారు. గోరక్షకుడు ప్రశాంత్ (సోనూసింగ్)పై ఆవుల అక్రమ రవాణా మాఫియా కాల్పులు జరిపితే, నిందితులపై కఠిన చర్య లు తీసుకోకుండా గోరక్షకుడిపై అభాండాలు మోపి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
గోరక్షకుడు సోనూ సింగ్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో డీజీపీకి మెమోరాండం ఇచ్చేందుకు వెళ్లితే అరెస్టు చేయడమేంటనీ రాంచంరద్‌రావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోవులను తరలిస్తుం డగా ఘట్‌కేసర్ వద్ద అడ్డుకోవడంతో ఎంఐఎం కు చెందిన గూండాలు జరిపిన కాల్పుల్లో సోనూ సింగ్ తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
సోనూ సింగ్ పై లేనిపోని అభాండాలతో, కేసు సెటిల్‌మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నా డంటూ రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాంచందర్‌రావు చెప్పారు. ఈ విషయంపై డీజీపీతో మాట్లాడటానికి వెళ్తుంటే అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ర్టంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం కొత్తగా పాలసీ తెస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు గోవులను కోసేవాళ్లకు గన్ లైసెన్సులు ఇస్తోందా..? అసలు రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ నడుస్తోందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు.
ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ర్ట ప్రభుత్వమే వహించాలన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని, లేనిపక్షంలో, బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.