calender_icon.png 24 October, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

130 మంది నామినేషన్ల తిరస్కరణ

24-10-2025 12:21:30 AM

  1. మొత్తం 321 నామినేషన్లకు గాను 135 ఆమోదం 
  2. బరిలో 81 మంది అభ్యర్థులు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల పరిశీలన స్క్రూటినీ ప్రక్రియ గురువా రం తుది దశకు చేరుకుంది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు, నిబంధనలు పాటించని కారణంగా సగానికి పైగా నామినేషన్లను తిరస్కరించారు.

భారీ సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో, ప్రస్తుతం 81 మంది అభ్యర్థులు ఉప ఎన్నికల బరిలో వున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటించ నున్నారు. 

అధికారిక వివరాల ప్రకారం..

- మొత్తం దాఖలైన నామినేషన్లు: 321

- ఆమోదం పొందిన నామినేషన్లు: 135

- తిరస్కరణకు గురైన నామినేషన్లు: 186

- నామినేషన్లు వేసిన అభ్యర్థులు: 211

- నామినేషన్లు ఆమోదం పొందిన అభ్యర్థులు: 81

- నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు: 130