09-01-2026 12:57:35 AM
హనుమకొండ, జనవరి 8 (విజ య క్రాంతి): రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అనేక నిధులు మంజూరు చేసినా గతంలో బీఆర్‌ఎస్, ఇప్పు డు కాంగ్రెస్ ప్రజలకు తప్పుడు సమాచారం చేరేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హనుమకొండకు వచ్చిన ఆయన భద్రకాళి దేవస్థానంలో పూజలు నిర్వహించారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమృత్ స్కీమ్స్, స్మార్ట్ సిటీలు, హృదయ్ స్కీమ్స్‌తో పాటు వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా వేలకోట్ల నిధులు కేటాయించిందన్నారు. వీటిద్వారా మున్సిపాలిటీలను సమర్థవంతంగా అభి వృద్ధి చేస్తోందన్నారు. అయినా గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా ఇప్పు డు కాంగ్రెస్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచా రం వ్యాప్తి చేస్తోందన్నారు.
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలనలో వరంగల్‌కు చేసిందేమీ లేదని, హనుమకొండ, వరంగల్‌తో పాటు జిల్లా పరిధి లోని కార్పొరేషన్లలో ఏ విధమైన అభివృద్ధి పనులు జరగలేదన్నారు. బీజేపీ తరఫున ఇక్కడి నుంచి ఒక్క ఎంపీ లేకపోయి నా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లతో వరంగల్ అభివృద్ధికి కృషి చేసిందన్నారు.
కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి జరుగుతోంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే రైలు కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. మామునూరు ఎయిర్‌పో ర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేస్తే ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు అన్నారు.
భూములపైనే ఆధారపడ్డ కాంగ్రెస్
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవలం భూములపై ఆధారపడే పనిచేస్తోందని, ప్రభు త్వ భూములను అప్పనంగా అమ్మడంతో కబ్జాకోరుగా మారిందని రాంచందర్‌రావు విమర్శించారు. గతంలో హైదరాబాద్ సెంట్ర ల్ యూనివర్సిటీలో సుమారు 100 ఎకరాల భూమిని ఇండస్ట్రీలకు, రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రమాదకర స్థాయికి కాంగ్రెస్ తీసుకెళ్లిందన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఓటీపీ లాగా ఇలా వచ్చి అలా మాయమైపోయారని విమర్శించారు.
నీటి వాటా సమస్య పరిష్కారానికి కృషి
గోదావరి, కృష్ణా నదుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు కొనసాగుతున్నాయని, ఈ సమస్యను సుప్రీంకోర్ట్, అపెక్స్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సి ల్ స్థాయిల్లో చర్చించి పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతోందని రాంచందర్‌రావు చెప్పారు. గతంలో కృష్ణా నది నీటి వాటాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కన్నా చాలా తక్కువగా కేవలం 299 టీఎంసీలే సరిపోతాయని కేసీఆర్ స్వయంగా అంగీకరించారని చెప్పారు.
తెలంగాణ రైతుల హక్కులను కాపాడాల్సిన సమయంలో రాష్ట్రానికి అన్యా యం జరిగేలా సంతకం పెట్టారని, ఇదే ఈరో జు కొనసాగుతున్న కృష్ణా నీటి అన్యాయానికి ప్రధాన కారణం అన్నారు. బీజేపీలో వర్గాలు లేవని, తమ పార్టీకి ఒక్కటే వర్గం ఉన్నదని- అది నరేంద్ర మోదీ నాయకత్వంలో నడిచే బీజేపీ వర్గం అని రాంచందర్‌రావు అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, రావు పద్మరెడ్డి, పగడాల కాళీ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, తుళ్ళ వీరేందర్ గౌడ్, యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గుం డె గణేష్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సు భాష్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీరాములు, ఒంటేరు జైపాల్, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్, కార్పొరేటర్లు చాడ స్వాతి, వసంత, కోమల, అభినవ్ భాస్కర్ పాల్గొన్నారు.