29-11-2025 12:00:00 AM
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటిదా కా అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉన్నామని అటు సీఎం సిద్ధరామయ్య.. ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గంభీరంగా పేర్కొన్నప్పటికీ లోలోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. హైకమాండ్ మాటకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్న డీకే శివ కుమార్ తాజాగా తన ‘ఎక్స్’ ఖాతాలో ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడ మే ప్రపంచంలో పెద్ద శక్తి’ అని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా సిద్ధరామయ్య.. ‘మేము కర్ణాటకకు ఇచ్చిన మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు సర్వస్వం’ అని ట్వీట్ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే కన్నడ రాజకీయం ఢిల్లీకి మారింది. 2023లో కర్ణాటకకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీకి మించి 23 సీట్లు అధికంగా సాధించి కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన డీకే శివకుమార్ శక్తికి మించి పనిచేశారు. దీంతో ఐదేళ్ల పాలనలో రెండున్నరేళ్లు పూర్తి కాగానే అధికార మార్పిడి జరగాలని ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు సిద్ధరామయ్య ఈ ఏడాది నవంబర్ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి ఆ తర్వాత సీఎం పగ్గాలను డీకేకు అప్పగించాలి.
కానీ సిద్ధరామయ్య పార్టీ కేంద్ర నాయకత్వంతో భేటీ అయ్యి ఐదేళ్లు తానే సీఎంగా ఉండేలా అనుమతులు తెచ్చుకోవడంలో తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు. ఇదే సమయంలో డిప్యూ టీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ కూడా సీఎం కుర్చీని వదులుకునేందుకు సిద్ధంగా లేరనిపించింది. నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో డీకే పాత్ర మరువలేనిది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా అన్ని వర్గాలను కలుపుకుని పోయి సమన్వయంతో వ్యవహరించి పార్టీని విజయపథంలో నడిపించారు. అయితే అపార పరిపాలన అనుభవం కలిగిన సిద్ధరామయ్యకే సీఎం పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం మొగ్గుచూపింది.
హైకమాండ్ ఆదేశాలను తాను శిరసావహిస్తానని డీకే చెప్పడంతో సమస్య చల్లబడినట్లుగా అనిపించింది. ఈ నవంబర్ 20తో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావడంతో అధికార మార్పిడి అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. శివకుమార్‌ను పొలిటికల్ మాస్టర్ మైండ్‌గా అభివర్ణించినప్పటికీ.. పాలన విషయంలో సిద్ధరామయ్య ఒక మెట్టు ముందు ఉంటారు.
జనతాదళ్ నుంచి బహిష్కరణకు గురై 2006లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సిద్ధరామయ్య పార్టీలో అగ్రస్థానానికి చేరుకున్నారు. 2013లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంతో పాటు సీఎంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారు. ఇటు సిద్ధూ.. అటు డీకేల్లో ఉన్న ప్రత్యేక లక్షణాలే ఇవాళ హైకమాండ్‌కు సీఎం మార్పు తలనొప్పిగా మారిపోయింది. 2006లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
పాలనా ఒప్పందంలో భాగంగా రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత జేడీఎస్ అధినేత కుమారస్వామి అయిష్టంగానే సీఎం పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు బీఎస్ యడ్యూరప్పకు అప్పగించారు. అయితే కొన్ని రోజులకే జేడీఎస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు రావడంతో ప్రభుత్వం కుప్పకూలింది. తాజా పరిస్థితుల్లో కాం గ్రెస్‌లో అలాంటి అవకాశం లేనప్పటికీ హైకమాండ్ సీఎం మార్పుపై ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరముంది.