calender_icon.png 8 October, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్రునయనాల మధ్య గంధం రామకృష్ణకు అంతిమ వీడ్కోలు

08-10-2025 12:11:41 AM

అంతిమయాత్రలో ఎమ్మెల్యే బిఎల్‌ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ 

మిర్యాలగూడ, అక్టోబర్ 7 (విజయ క్రాంతి):  కాంగ్రెస్ సీనియర్ యువ నాయకులు, 14వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ గంధం రామకృష్ణ ఆత్మీయుల, బంధువుల, పార్టీ శ్రేణుల, అభిమానుల అశ్రునయనాల మధ్య మంగళవారం బాధాతప్త హృదయంతో నిర్వహించారు. ఈనెల 6న ( సోమవారం) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన గంధం రామకృష్ణ మృతదేహాన్ని పలువురు ప్రముఖులు, అభిమా నులు సందర్శించి మృతదేహంపై పూలమాలవేసి  ఘనంగా నివాళులర్పించారు.

తమ కుటుంబ సభ్యున్ని కోల్పోయినట్లుగా అంత బాధాతప్త హృదయంతో రామకృష్ణ అమర్ రహే అంటూ అంతిమయాత్రలో పాల్గొన్న వారు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వయసులోనే ప్రజా జీవితంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అవిశ్రాంతం శ్రమించి అందరి మధ్యలో చెరగని ముద్ర వేసిన ఆయన మరణం జీర్ణించుకోలేని అభిమానులు పార్టీ శ్రేణులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బి ఎల్ ఆర్ ), ఎమ్మెల్సీ కేతా వత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, రాజకీయాలకతీతంగా తాజా మాజీ వార్డ్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, మున్నూరు కాపు సంఘ నాయకులు  మృతుడి భార్య సంధ్య,  కుమారుడు కుమార్తెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారిని ఓదార్చారు. చిన్న వయసులోని ప్రజల్లో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న   ఆయన పేదల గుండెల్లో గూడు కట్టుకొని చెరగని ముద్ర వేశారని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, పొదిల  శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్లు దేశి రెడ్డి శేఖర్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, జానీ, 25 వార్డు ఇన్చార్జి గోదాల జానకి రామ్ రెడ్డి, వార్డ్ ఇన్చార్జులు చిలుకూరి బాలు,అబ్దుల్లా, మేకల శ్రీనివాస్. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అజారుద్దీన్, కోదాటి అనిల్, మాజీ ఎంపీటీసీ బెజ్జం సాయి, మీడియా ఇన్చార్జి శరత్, నాయకులు  నాగు నాయక్, నాగరాజు యాదవ్, పాత కోటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.