03-01-2026 12:00:00 AM
పంజా విసురుతున్న దోపిడీ ముఠా
రెండు ఏటీఎంలలో దోపిడీ
ఆనవాళ్లు దొరక్కుండా దగ్ధం చేసిన ముఠా
జువెలరీ షాప్ దోపిడీకి విపలయత్నం
వారం రోజుల్లో 4వ దోపిడి
పోలీసులకు సవాల్ విసురుతున్న దోపిడి ముఠా
నిజామాబాద్, జనవరి 2 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు పంజా విసురుతూనే ఉన్నారు. ఈ దోపిడీ దొంగలకు జిల్లాతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రాంతాల్లో పట్టు సాధించినట్లు తెలుస్తోంది. అసలు ఈ దోపిడీ ముఠాకు స్థానికంగా ఎవరైనా సహకరిస్తున్నారా. ఇక్కడి సమాచారాన్ని పూర్తిగా రాబట్టుకున్న తర్వాతే పక్కా స్కెచ్ తో దోపిడీ దొంగలు తమ పంజా విసురుతున్నారు. గత కొన్ని రోజులుగా దోపిడీ ముఠాలు ఏటీఎంలో ఇళ్లను వ్యాపార సముదాయాలను దోచుకుంటున్నారు ఈవరుస సంఘటనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏకంగా ఏటీఎంలను పగలగొడుతున్న ఈ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు పక్కా సమాచారంతో తమకు అనువైన ప్రాంతాన్ని ఎంచుకొని మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజులుగా రాత్రులు చలి తీవ్రత ఎక్కువ గా ఉండడంతో జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతాలలో ఈ దోపిడి ముఠా పంజా విసురుతోంది. గత నెల 27వ తేదీజామాబాద్ నగరంలో రెండు చోట్ల దోపిడి దొంగలు ఏటీఎంల దోపిడీకి తెగబడ్డారు.
శనివారం తెల్లవారుజామున నగరంలో ఈ దోపిడి ముఠా స్త్వ్రర విహారం చేసింది. ఈ దోపిడి సంఘటన తో పోలీసులు ఉలిక్కిపడ్డారు. దోపిడీలలో ఆరితేరిన ఈ ముఠా గంటన్నర వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో ఏటీఎంల దోపిడీకి పాల్పడింది. దాదాపు 30 లక్షలకు పైగానే డ్యూటీ చేసినట్టుగా తెలుస్తోంది. ఏటీఎంలో దోపిడీకి పాల్పడిన ఈ ఘరా ముఠా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏటీఎంలకు నిప్పు పెట్టి దగ్ధానికి పాల్పడ్డారు. నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డు సాయి నగర్ వద్ద మెయిన్ రోడ్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డట్టు పాల్పడ్డారు. ఏటీఎంలోని డబ్బునంత దోచుకున్న తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించరు. సెలవులను పురస్కరించుకొని బ్యాంక్ సిబ్బంది గత రెండు రోజుల క్రితమే ఏటీఎంలో సుమారు పది లక్షలకు పైగా నగదు జమ చేసిడబ్బు దోచుకుంది.
వర్ని రోడ్ లో దోపిడీకి పాల్పడిన ముఠా నేరుగా నిజామాబాద్ నగర శివారులోని పాంగ్ర ప్రధాన కూడలి హైదరాబాదు రోడ్డు లో గల జిల్లా సహకార బ్యాంకు కు చెందిన ఏటీఎం ను కూడా ఈ ముఠా దోచుకుంది. నగరంలోని రెండు ఏటీఎంలో లూటీలో 35 లక్షల పై గా రూపాయల దోపిడీకి గురైనట్టు అధికారులు గుర్తించారు. దోపిడీ అనంతరం ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు సహకార బ్యాంకు ఏటీఎం ను కూడా తగలబెట్టారు. శనివారం తెల్లవారుజాము గంట వ్యవధిలోనే నగర నడిబొడ్డులో దోపిడీకి పాల్పడ్డ రెండు ఏటీఎంలను దోచుకున్న ఈ ముఠా ఆనవాళ్లను సీసీటీవీ ఫుటేజీలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఈ దోపిడీ ముఠా కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ మీదుగా బాన్సువాడ నుండి క్రెటా కారులో నిజామాబాద్ నగరానికి చేరుకొని దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వాహనంలో ఐదుగురికి పైగా ముఠా ఉన్నట్టు పోలీసులవిచారణలో బయటపడింది. మహారాష్టరహదారిలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళలో ముఖ్యంగా ఏటీఎంలో వద్ద బ్యాంకులో జనసాంద్రత ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ ను పెంచాలని జిల్లాలో కి ప్రవేశించే వాహనాలు జిల్లాల నుండి బయటకు వెళ్లే వాహనాలను చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీ చేయాలని ఏటీఎం భద్రత లోపాలను బలోపేతం చేయడానికి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి అలారం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏటీఎంలో వద్ద శక్తివంతమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని రాజేష్ చంద్ర సూచనలు ఇచ్చారు.
దోచుకున్న ఏటీఎంలను దగ్ధం చేసిన సంఘటన మరువకముందే నగరం నడిబొడ్డులోని ఖలీల్వాడిలో మరో ఏటీఎం దోపిడీకి విపళయత్నం చేశారు రెండు రోజుల అనంతరం మళ్లీ స్థానిక ఖలీల్ వాడి ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దోపిడీకి యత్నించిన మరో సంఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసు లు ప్రత్యేక ఐదు వందల బృందాలను రంగంలోకి దింపారు దోపిడి ముఠాను పట్టుకోవడానికి దోపిడి ముఠాలు పోలీసులకు సవాల్ విసురుతూ తాజాగా నగరంలో దోపిడీ యత్నం చేసిన మరొ ఘటన గురువారం అర్ధరాత్రి అనంతరం వెలుగు చూసింది.
నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు బజార్ సమీపంలో గల శ్రీగణేష్ జ్యువెలరీ షాప్ ను దోచుకునేందుకు దుండగులు విఫల యత్నం చేశారు. అర్ధరాత్రి అనంతరం ముఖాలకు ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు సభ్యులు జ్యువెలరీ షాపు వద్దకు వచ్చి ఇనుప రాడ్లతో షట్టర్ ను ధ్వంసం చేసి పైకి లేపే లోనికి దూరెందుకు ప్రయత్నించారు. అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది అటువైపుగా రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే పోలీసు సిబ్బంది సైతం వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన దుండగులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దోపిడీ యత్నం విషయం తెలియడంతో ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి, నగర సీఐ శ్రీనివాస్ రాజ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై షాపు యజమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో టౌన్ ఎస్త్స్ర హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.