24-05-2025 04:32:24 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన బాలగోని రాములు(55) అనే గీతా కార్మికుడు శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్(Huzurabad Area Hospital) కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు తెలిపారు. రాములు చెట్టుపై నుండి పడడంతో జీవనోపాధి గీత కార్మిక వృత్తికి దూరమయ్యాడని, రెక్క ఆడితే గాని డొక్కా ఆడని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం రాములు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గీత కార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు కోరుతున్నారు.