calender_icon.png 24 May, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాము కాటుతో వ్యక్తి మృతి..

24-05-2025 04:30:18 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తాండూరు మండలం(Tandur Mandal) రేపల్లెవాడకు చెందిన వర్కడే విష్ణు ప్రసాద్(52) పాముకాటుతో మృతి చెందాడు. ఇంట్లో నిద్రిస్తుండగా శనివారం పాము కాటు వేసింది. మృతుని సోదరుడు వర్కడే మాన్ సింగ్ పాముకాటుతో మృతి చెందినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విష్ణు ప్రసాద్ మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నివాస మాత్రం రేపల్లెవాడలో ఒక్కడే ఉంటున్నాడు. గదిలో నిద్రిస్తున్న ఆయనను గుర్తుతెలియని పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామనీ తాండూర్ ఎస్సై డి కిరణ్ కుమార్ వెల్లడించారు.