24-05-2025 04:35:27 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ల సమావేశం(LFL Headmaster Meeting) కేసముద్రం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జరిగింది. ఈ సందర్భంగా నూతన మండల కమిటీలను ఎన్నుకున్నారు. కేసముద్రం మండల అధ్యక్షునిగా కళ్లెం వీరారెడ్డి, ఇనుగుర్తి మండల అధ్యక్షునిగా లూనావత్ శరత్ ఎన్నికయ్యారు. కేసముద్రం మండల ప్రధాన కార్యదర్శిగా బానోత్ దేవ్ సింగ్, ఇనుగుర్తి మండల ప్రధాన కార్యదర్శిగా బానోత్ వీరన్నలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కేసముద్రం, ఇనుగుర్తి మండలాల అధ్యక్షులు కళ్లెం వీరారెడ్డి, లూనావత్ శరత్ మాట్లాడుతూ... ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు, హక్కులను సాధించుకునేందుకు, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయుట కోసం మండల కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరినాథ్, ప్రమీల, రత్న శేఖర్, ఎస్ వీరన్న, ఓంజీ, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.