calender_icon.png 15 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గ్రామదేవతల ఊర పండగ

15-09-2025 12:15:22 AM

డిచ్‌పల్లి సెప్టెంబర్ 14 (విజయక్రాంతి):  డిచ్పల్లి మండలం లోని పలు గ్రామాల్లో చ్‌గామాల్లో డిచ్పల్లి  గ్రామంలో ఘనంగా గ్రామ దేవతల  ఊర పండుగ ఉత్సవాలు  పోతురాజుల  నృత్యాలతో గ్రామంలోని చిన్న పెద్ద ప్రజలందరూ కలిసి ఊర పండగ జరుపుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ రెండు  రోజులపాటు ప్రత్యేక కార్యక్ర మాలు నిర్వహిస్తారు. మండలంలోని ముల్లంగి  ’ఐ’ దూసుగా0,,కమలాపూర్,నడిపల్లి,గ్రామాలలో, ఘనంగా గ్రామదేవతల కు కొబ్బరికాయ లు కొట్టి మొక్కలు తీర్చుకున్నరు, పలు గ్రామాల ప్రజలు.   

 గ్రామం లో పశువు పాడి సమృద్ధిగా ఉండాలని పిల్ల పాప కుటుంబ సభ్యులందరూ గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో  సుఖ సంతోషంతో  ఉండాలనికోరుతూ ఈ ఊరు పండుగ నిర్వహిస్తమని డిచ్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.శనివారం గ్రామదేవతలకు పట్టుపరిచి కొత్త దుంగాలతో  గ్రామ దేవతలు పోచవ్వ, మైసవ్వ, అంపుడు, పోశవ్వ, ఐదు చేతుల పోచమ్మ, మహాలక్ష్మి, రక్త మహంకాళి, ఊర పోచమ్మ, ముత్యాలమ్మ, లక్ష్మమ్మ ,విగ్రహాలను ప్రత్యేక దుంగలతో తయారుచేసి  గ్రామ వడ్రంగులు  సుచి శుభ్రత పాటించి, తయారు చేస్తారు. దేవతమూర్తుల రూపం చెక్కిన దేవతలను గ్రామ  పెద్ద మనుషులంతా కలిసి ప్రతిష్టిస్తారు.

ఆదివారం  ఉదయం  అత్యంత నియమ నిష్ఠలతో గ్రామంలోని ప్రధాన కూడలి ల గుండా  గ్రామస్తులంతా కలిసి మహిళలు యువతులు కలిసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకొని, గ్రామాన్ని సుభిక్షంగా ఉంచుకోవడానికి తరతరాలుగా చేస్తున్న గ్రామ ఊర పండుగలు జరుపుతారు. ఊర పండుగకు పూజారులుగా ఆసది వారు. పోతురాజులు డబ్బులు బాజాలతో భాజా భజంత్రీలతో ప్రత్యేక పూజలు చేస్తూ గ్రామదేవతలను కొలిచి పూజించి మొక్కు బలులు చెల్లించుకుంటామని పేర్కొన్నారు. ఊర పండుగ సందర్భంగా ప్రతి కుటుంబ సభ్యులు తమ కూతుర్లను అల్లుళ్లను మనుమలను ఇంటికి పిలిచి,ఈ గ్రామ పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారని తెలిపారు.