15-09-2025 12:16:26 AM
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 15 (విజయ క్రాంతి): తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ హిందీ దివస్ నిర్వహించారు. రాష్ట్ర బాధ్యులు అబ్దుల్ జమీల్ మా ట్లాడుతూ హిందీ భాషను అధికార భాషగా గుర్తించడంలో చాలామంది కవులు, కళాకారులు, రచయితలు , కృషి చేశారని తెలిపా రు. దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఏకతాటిపైకి తెచ్చిన మహోత్తర మాధ్యమం హిందీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్, రాష్ట్ర బా ధ్యులు మసూద్ మీర్జా, ముహమ్మద్ ఫయా జ్ అలీ, ముతాహరుద్దీన్, హిందీ ఉపాధ్యాయులుపాల్గొన్నారు.