calender_icon.png 8 August, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

08-08-2025 04:50:07 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల(Sri Saraswathi Shishu Mandir English Medium School)లో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని పాఠశాల కార్యదర్శి బాలా సంతోష్, మంచిర్యాల విభాగ్ అకాడమిక్ ఇన్చార్జి పూదరి సత్యనారాయణల ఆధ్వర్యంలో మాతృభారతి సభ్యులు వైభవంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలను అర్చకులు శ్రీరామ్ బట్ల శివకృష్ణ వివరించారు. పూజా కార్యక్రమంలో 30 మంది మహిళలు పాల్గొని వాయినాలు సమర్పించారు. సామూహిక వరలక్ష్మి వ్రతంలో మాతృభారతి సభ్యులు సుష్మా లాహోటి, అనిత యాదవ్, సలహా సమితి సభ్యులు నల్మా సంతోష్, నంది సంతోష్, ముత్య వెంకటేష్, ప్రధానాచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.