calender_icon.png 8 August, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియాపై అవగాహన కలిగి ఉండాలి

08-08-2025 04:52:31 PM

ఏవో ప్రణీత..

బోయినపల్లి (విజయక్రాంతి): బోయినపల్లి మండలంలోని కోరేం, బోయినిపల్లి ప్రాథమిక సహకార సంఘాల్లో మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో రైతులను కలిసి నానో యూరియా ఉపయోగాల గూర్చి ఏవో ప్రణీత(AO Pranitha) వివరించారు. 500 మి. లీ. నానో యూరియా ఒక బస్తా యూరియాతో సమానం అని చెప్పారు. ఇందులో 20 శాతం నత్రజని ఉంటుందని నేల, గాలి, నీటి కాలుష్యము తగ్గించి, కీటకాల తెగుళ్ల ఉధృతిని తగ్గిస్తుందని రైతులకు వివరించారు. వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటలలో 2వ ,3 వ దఫలల్లో పై పాటుగా వేసే యూరియాని ఈ నానో యూరియా పూర్తిగా భర్తీ చేయగలదు అని చెప్పారు. ఈ నానో యూరియాని పురుగుమందులతో కలిపి డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తే రైతుకు ఖర్చు తగ్గి, మరింత సమర్థవంతంగా పని చేస్తాయని మండల వ్యవసాయ అధికారిణి కే. ప్రణీత తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పుడు ఎరువులు వేయడం కానీ, పిచికారీ చేయడం కానీ చేయకూడదు అని రైతులకు సూచించారు.