calender_icon.png 22 July, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా తొట్టెల ఊరేగింపు

22-07-2025 01:01:14 AM

ఖైరతాబాద్; జూలై 21 (విజయ క్రాంతి) : లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర సందర్భంగా  రంగ వంశీయుల ఆధ్వర్యం లో అంగరంగ వైభవంగా తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. లాల్  దర్వాజా చౌర స్తా నుంచి బయలు దేరి, భక్తుల ఆట పాటలు, పూజలతో సింహ వాహి ని ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి తొట్టెలు సమర్పించారు. ఈ  సందర్భంగా  రంగ వంశానికి చెందిన అమర్ నాథ్ గౌడ్ మాట్లాడుతూ..

కొన్ని దశాబ్దాలుగా తమ వంశానికి చెందిన పూర్వికులు  అమ్మవారికి తొట్టెలను సమర్పిస్తూ  వస్తున్నారని చెప్పారు. గత నూట పదిహెడు ఏళ్లుగా తమ వంశం తొట్టేల సమర్పణ చేస్తున్నట్టు వివరించారు, ఈ కార్యక్రమం లో  రంగా ప్రభాకర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్,రంధీర్ గౌడ్ , మురళి గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, కృత్ వీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.