22-07-2025 01:00:18 AM
- నిర్మల్ కళ్యాణి జాతీయ రహదారి నాలుగు లైన్ల విస్తరణ
- కేంద్రం పచ్చ జెండాతో ప్రజల హర్షం
నిర్మల్, జూలై ౨౧ (విజయక్రాంతి): చారిత్రాత్మక నగరిగా పేరు ప్రఖ్యాతలు పొందిన నిర్మల్ జిల్లాకు మరో జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. నిర్మల్ కళ్యాణి ఎన్ హెచ్ 61 జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మల్ జిల్లాలో రహదారి అభివృద్ధి పనులు విస్తరణ జరిగే అవకాశం ఉండడంతో నిర్మల్ బైంసా బాసర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 15 జాతీయ రహదారుల అభివృద్ధి విస్తరణకు కేంద్ర రహదారుల సంస్థ 33 691 కోట్లను కేటాయించగా అందులో నిర్మల్ కళ్యాణి రహదారి ఉండడంతో ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మ ల్ పట్టణ కేంద్రంగా ఇప్పటికీ హైదరాబాదు నాగపూర్ జాతీయ రహదారి 64 ఉండగా, నిర్మల్ ఖానాపూర్ జగిత్యాల్ జాతీయ రహదారి విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. దీనికి తోడు నిర్మల్ కళ్యాణి 635 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రెండు లైన్లో ఉన్న జాతీయ రహదారిని ఫోర్ లైన్ విస్తరణ రహదారిగా మార్చేందుకు నిధులు కేటాయించాలని ఇటీవలే ఎంపీ నాగేశ్వర్‌తో పాటు బిజెపి ఎమ్మె ల్యేలు రామారావు పటేల్ మహేశ్వర్ రెడ్డి పాల్వాయి హరీష్ బాబు తదితరులు కేంద్ర రహదారుల శాఖ మంత్రి గట్కరికి వినతి ప త్రం అందించారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో ప్రస్తుతం పట్టణ జనాభా పెరగ డం నిర్మల్ నాగపూర్ జాతీయ రహదారితో పాటు నిర్మల్ జగిత్యాల్ రహదారి ఉండడం బోధన్ బైంసా జాతీయ రహదారి విస్తరణ పనులు జరగడం దీనికి లింకుగా కళ్యాణి ఫోర్ లైన్ నేషనల్ హైవే రోడ్డు పనులకు కేంద్రం సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది
53 కిలోమీటర్ల విస్తరణకు డిపిఆర్
నిర్మల్ కళ్యాణి జాతీయ రహదారి అభివృద్ధి లో భాగంగా రెండు లైన్లు ఉన్న రహ దారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారి నిర్మల్ నుండి ప్రారంభమై బైంసా బేల్ తరుడా మీదుగా బోకర్ నాందేడ్ ద్వారా కళ్యాణి వరకు నిర్మించవలసి ఉంటుంది. నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా నుండి తానూర్ మండలంలోని బెల్ తెరోడా మహారాష్ట్ర బోర్డర్ వరకు 53 కిలోమీటర్ల రెండు వరసల రాధారిని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు సమంత డి పి ఆర్ ను రూపొందించాలని కేంద్ర మంత్రి సూచించినట్టు నిర్మల్ బైంసా ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ తెలిపారు.
ప్రస్తుతం నిర్మల్ నుండి మహారాష్ట్ర బోర్డర్ బేల్ తో రోడ్ వరకు 53 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి పై చిట్యాల దిల్వార్పూర్ కల్లూరు బైంసా మాటేగా వానల్పాడు ఇతర ప్రాంతా ల్లో ఇరుకు వంతెనలు ఉండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతూ ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. రెండు వరసల రహ దారి కావడంతో వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం గాయపడిన వంటి సంఘటనలు జరుగుతు న్నాయి. 10 సంవత్సరాల క్రితం సింగిల్ రహదారిగా ఉన్న ఈ రోడ్డును డబుల్ లైన్ రహదారిగా ఏర్పాటుచేసి టోల్ ప్లాజా వసూలు చేస్తున్నారు. అయితే ఈ రాదారిని ఫోర్ లైన్ గా మార్చితే నిర్మల్ నుండి బైంసా మహారాష్ట్రలోని భోకర్ నాందేడ్ ధర్మాబాద్ బోధన్ ముధోల్ నిజాంబాద్ రహదారులకు అనుబంధంగా ఉండడం వల్ల నిజాంబాద్ నిర్మల్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ పట్టణం నుండి నాలుగు వైపులా రహదారులు ఉండడంతో ఫోర్ లైన్ విస్తరణ జరిగితే మరింత అభివృద్ధి జరిగి పట్టణం విద్యా వాణిజ వ్యాపార కేంద్రంగా ఎదగడానికి మరింత దోహదపడుతుందని ఈ ప్రాంత ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లైన్ నిర్మాణం లేకపోవడంతో ఫోర్ లైన్ ఏర్పడితే ట్రాఫిక్ సమస్య ఉండదని వారు భావిస్తున్నారు . అయితే వీలైనం త త్వరగా డిపిఆర్‌ను తయారుచేసి 2028 నాటికి ఫోర్ లైన్ విస్తరణ పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ప్రజాప్రతినిధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు