22-07-2025 12:35:54 AM
మహబూబాబాద్, జూలై 21 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గ్రామంలో నూతనంగా శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆడబిడ్డలు బోనాలు సమర్పించేందుకు పుట్టినింటికి రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.