22-07-2025 12:37:09 AM
మహబూబాబాద్, జూలై 21 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామ శివారు సూర్య తండా నుంచి తులసియా కాలనీకి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేక 25 కుటుంబాలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీకి సరైన రోజు వసతి కల్పించాలని అనేక సంవత్సరాలుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో రోడ్డు పూర్తిగా బురద మయంగా మారి కాలినడకకు కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమ కాలనీకి మెరుగైన రహదారి నిర్మాణం చేయించాలని వేడుకుంటున్నారు.