calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోతె జగన్నాథం కళాబృందానికి ఘన సన్మానం

22-09-2025 12:00:00 AM

వరంగల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లా, నర్మెట్ట మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన ప్రఖ్యాత కొయ్యబొమ్మల కళాకారుడు కీర్తిశేషులు మోతె జగన్నాథం అమూల్యమైన కళను  గుర్తిస్తూ, ఆయన సతీమణి  మోతె ఉప్పలమ్మ, కుమారుడు కనకయ్య నరసయ్య శ్రీనివాస్ , కొండయ్య , మీనయ్య , ఐలెయ్య, యాదగిరి , శంకర్ , రవి వారి కళాబృందాన్ని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలనీలో ఘనంగా సన్మానించారు. 

ఈ అవార్డును మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ అందచెయ్యడము జరిగింది. ఎంపవరింగ్ లైవ్లిహుడ్స్, హానరింగ్ ఎక్సలెన్స్  నిర్వహించిన ఆశా గీతాంజలి 2025 ‘అమ్మ ఒడి - నా తెలంగాణ ‘ రాయపూడి నాగేంద్ర రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కొయ్యబొమ్మల కళపై మోతె జగన్నాథం కుటుంబం చూపిన అంకితభావం, త్యాగం, సంప్రదాయ కళల పరిరక్షణలో వారి విశిష్ట సేవలను కొనియాడారు.

దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ, ఈ సన్మానం కీర్తిశేషులు మోతె జగన్నాథం  కుటుంబం , వారి కళాపై మనం కలిగిన గౌరవానికి ప్రతీకం అని అన్నారు. శ్రీ బలరాం CMౄ , సింగరేణి కాలరిస్,  prof .M.పాండురంగారావు , కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్ సభ్యులు , పేరాల శేఖర్ రావు పాల్గొన్నారు . 

గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు, మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ విచ్చేయగా, ఇతర ప్రజాప్రతినిధులు ఈటల రాజేందర్,  పైడి రాకేష్ రెడ్డి, కోవ లక్ష్మి,  పల్వాయి హరీష్ బాబు, బిట్స్ పిలనీ డైరెక్టరు prof .ముఖర్జీ , డీన్ prof .యోగేశ్వరిని, ఇతర ప్రొఫెసర్లు విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన అనేకమంది ఆదివాసీలు,కళాకారులు,సామాజిక వేత్తలు పాల్గొన్నారు.