08-01-2026 12:08:34 AM
చిట్యాల, జనవరి 7(విజయక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చిట్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బుధవారం ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మార్గమధ్యలో నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య కేటీఆర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
కేటీఆర్ అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని, పార్టీ నాయకులను కార్యకర్తలను, అభిమానులను ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, మెండే సైదులు, బొబ్బిలి శివ శంకర్ రెడ్డి, ఆగు అశోక్, చిత్త శేఖర్, ఆవుల ఆనంద్ పాల్గొన్నారు.