calender_icon.png 10 January, 2026 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

09-01-2026 03:16:12 PM

టీఎస్యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రాజకమలాకర్ రెడ్డి

పెంచికల్ పేట్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాజకమలాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్  పిలుపు మేరకు శుక్రవారం టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మండలం చేడ్వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం జనవరి 10న ప్రధాని, రాష్ట్రపతులకు మెమోరండంలు పంపాలని, ఫిబ్రవరి 5న జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశోక్‌చందర్‌, సంతోష్‌కుమార్‌, శ్రీనివాస్‌, శిల్ప, ద్రుపదబాయి, శ్రీకాంత్‌, వెంకటేష్‌, శ్రీధర్‌, సునీత, అశ్విని పాల్గొన్నారు.